భారత్ వరల్డ్ కప్ గెలిచి ఏప్రిల్ 2 నాటికి సరిగ్గా 12 సంవత్సరాలు అవుతుండటంతో.. మ్యాచ్ లో మీ అత్యుత్తమమైన ఫీలింగ్ ఏంటి అని అడిగితే.. అందరు విన్నింగ్ సిక్స్ గురించి చెబుతారని అనుకున్నారు. అందుకు విరుద్దంగా ఆన్సర్ ఇచ్చాడు ధోని. నాకు ఫైనల్ మ్యాచ్ లో అవే మధురమైన క్షణాలు అంటూ చెప్పుకొచ్చాడు. మరి ఆ మధుర క్షణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
టీమిండియా 28 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ.. 12 సంవత్సరాల క్రితం మహేంద్ర సింగ్ ధోని నాయకత్వంలో ఫైనల్లో శ్రీలంక ను చిత్తు చేసి 2011 వన్డే వరల్డ్ కప్ ను సొంతం చేసుకుంది భారత జట్టు. ఇక ఈ మ్యాచ్ అనగానే అభిమానులందరికి గుర్తుకు వచ్చేది ధోని సిక్స్ మాత్రమే. సూపర్ సిక్స్ తో ధోని టీమిండియాకు విజయాన్ని అందించిన విషయం అందరికి తెలిసిందే. ఇక భారత్ వరల్డ్ కప్ గెలిచి ఏప్రిల్ 2 నాటికి సరిగ్గా 12 సంవత్సరాలు అవుతుండటంతో.. ధోని ఈ మ్యాచ్ గురించి తాజాగా స్పందించాడు. ఫైనల్ మ్యాచ్ లో మీ అత్యుత్తమమైన ఫీలింగ్ ఏంటి అని అడిగితే.. అందరు విన్నింగ్ సిక్స్ గురించి చెబుతారని అనుకున్నారు. అందుకు విరుద్దంగా ఆన్సర్ ఇచ్చాడు ధోని. నాకు ఫైనల్ మ్యాచ్ లో అవే మధురమైన క్షణాలు అంటూ చెప్పుకొచ్చాడు. మరి ఆ మధుర క్షణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
2011 ఏప్రిల్ 2 ప్రతి భారతీయుడి గుండెల్లో నిలిచిపోయే రోజు. 28 సంవత్సరాల వరల్డ్ కప్ నిరీక్షణకు తెర దించిన రోజు. 2011 ప్రపంచ కప్ ఫైనల్లో శ్రీలంకను చిత్తు చేసి టీమిండియా వరల్డ్ కప్ ను కైవసం చేసుకుంది. ఇక ఈ మ్యాచ్ లో గౌతమ్ గంభీర్, ధోని అద్భుతంగా రాణించిన విషయం తెలిసిందే. ఇక లాస్ట్ లో సిక్స్ తో విన్నింగ్ షాట్ ను ముగించిన ధోని ఈ మ్యాచ్ లో హీరో అయ్యాడు. అదీకాక ఈ సిక్స్ ఈ మ్యాచ్ కే హైలెట్ గా నిలిచింది. ఇక ఇదంతా కొద్ది సేపు పక్కన పెడింతే.. ఈ ఫైనల్ మ్యాచ్ లో ధోనికి ఇష్టమైన క్షణం ఏంటని ప్రశ్నించగా.. అందరు లాస్ట్ లో కొట్టిన సిక్స్ అని చెబుతాడు అని అనుకున్నారు. కానీ ధోని అది చెప్పలేదు.
ఈ సందర్భంగా ధోని మాట్లాడుతూ..”2011 వరల్డ్ కప్ ఫైనల్లో విజయం సాధించడానికి కొద్ది సేపు ముందు నుంచే నేను బెస్ట్ ఫీలింగ్ అంటే ఏంటో అనుభవించాను. ఈ మ్యాచ్ లో మేం కచ్చితంగా విజయం సాధిస్తామని మాకు తెలుసు. అయితే అప్పటికే దాదాపు 60 వేల మంది వందే మాతరం పాడుతూ ఉంటే అద్భుతం అనిపించింది. ఇవే నాకు అత్యుత్తమమైన క్షణాలు” అంటూ చెప్పుకొచ్చాడు ధోని. ఇక సచిన్ గురించి ప్రస్తావిస్తూ.. సచిన్ కు ఇదే చివరి ప్రపంచ కప్ అని మా అందరికి తెలుసని, దాంతో ఎలాగైన ఈసారి కప్ ను సచిన్ చేతుల్లో ఉంచాలనకున్నాం అని ధోని తెలిపాడు. జట్టు సభ్యులు, సహాయక సిబ్బంది మద్ధతుతోనే కప్ ను సాధించగలిగాం అంటూ ధోని చెప్పుకొచ్చాడు. మరి వందేమాతం పాడిన క్షణాలే నాకు ఇష్టమైన క్షణాలని చెప్పిన ధోని వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.