డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్‌కింగ్స్‌కు ఐపీఎల్-2022 సీజన్ అస్సలు కలిసిరాలేదు. టోర్నీ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా ఘోర వైఫల్యంతో విమర్శలు మూటగట్టుకుంది. తొలుత రవీంద్ర జడేజాను కెప్టెన్‌గా నియమించడం.. వరుస పరాజయాలు.. ఆ తర్వాత మళ్లీ ధోనికి సారథ్య బాధ్యతలు అప్పజెప్పడం వంటి నిర్ణయాలు ఆ జట్టులోని గందరగోళ పరిస్థితులను కళ్లకు కట్టాయి. ఇక, ఐపీఎల్ ముగిసిన తర్వాత ధోని తన స్వస్థలం జార్ఖండ్ కు వెళ్లిన సంగతి తెలిసిందే. అక్కడకి వెళ్ళిన మహేంద్రుడు సమయాన్ని వృధా చేయడం ఎందుకు అనుకున్నాడో ఏమో కానీ.. పంచాయతీ ఎన్నికల్లో విధులు నిర్వహిస్తూ కెమెరా కంటికి చిక్కాడు. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
అవునండీ.. మీరు విన్నది నిజమే.. కానీ, ఇక్కడే ఓ ట్విస్ట్ ఉంది. ఆ విధులు నిర్వర్తిస్తోంది టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని కాదు. ధోని లాంటి పోలీకలు ఉన్న వ్యక్తి. పేరు వివేక్ కుమార్. సీసీఎల్‌లో అసిస్టెంట్ మేనేజర్ గా పనిచేస్తున్నారు. ప్రస్తుతం జార్ఖండ్ లో జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లో విధులు నిర్వహిస్తూ కెమెరా కంటికి చిక్కాడు. అతన్ని దగ్గర నుంచే చూస్తే.. అచ్చం మహేంద్ర సింగ్ ధోనీలానే కనిపిస్తున్నారు. దీంతో.. అక్కడున్న వారంతా ధోని ధోని అంటూ రావడమే కాకుండా.. అతనితో పోటీ పడి మరీ సెల్ఫీలు తీసుకున్నారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే.. దేశం కోసం సైనికుడిగా మారిన.. ఆ సాహసం చేయడానికి వెనుకాడడంటూ నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు.
ఇక ఈ సీజన్ లో చెన్నై జర్నీ రోలర్ కోస్టర్ ను తలపించింది. సీజన్ ఆరంభానికి కొన్ని రోజుల ముందే తాను కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్లు ధోని ప్రకటించడం.. కొత్త కెప్టెన్ గా రవీంద్ర జడేజా ఎంపికవ్వడం అన్నీ చకచకా జరిగిపోయాయి. డిఫెండింగ్ చాంపియన్ హోదాలో సీజన్ లో అడుగుపెట్టిన చెన్నై జట్టుకు ఆరంభం నుంచే ఓటములు పలుకరించాయి. 8 మ్యాచ్ ల తర్వాత తాను కెప్టెన్ గా ఉండలేనంటూ జడేజా సారథ్య బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. దాంతో మరోసారి ధోనియే చెన్నై సారథిగా మారాడు. మొత్తానికి 14 మ్యాచుల్లో కేవలం 4 విజయాలతో 8 పాయింట్లు సాధించి పట్టికలో తొమ్మిదో స్థానంలో నిలిచింది.
ఇది కూడా చదవండి: Sania Mirza: జిమ్‌లో కఠిన వర్కౌట్స్‌తో కుస్తీ పడుతున్న సానియా మీర్జా! వీడియో వైరల్!
ఇక, వచ్చే సీజన్ లో కూడా ఆడతానంటూ ధోని స్వయంగా ప్రకటించాడు. ‘ నేను కచ్చితంగా వచ్చే ఏడాది ఆడతాను. సీఎస్కే తరఫున సీఎస్కే హోం గ్రౌండ్ లో సీఎస్కే అభిమానుల ముందు ఆడాలని ఉంది. ఒకవేళ ఇదే లాస్ట్ ఐపీఎల్ అయితే సీఎస్కే అభిమానులకు అన్యాయం చేసినట్లే. అందుకే వచ్చే ఏడాది కూడా ఎల్లో జెర్సీలో కన్పించాలనుకుంటున్నా. వచ్చే ఏడాది వరకు కరోనా తగ్గుముఖం పట్టొచ్చు.. అలాజరిగితే.. కేవలం ముంబై మాత్రమే కాకుండా అన్ని వేదికల్లో గేమ్స్ జరుగుతాయి. అలాంటప్పుడు వీడ్కోలు తీసుకోవడం బాగుంటుంది’ అని ధోనీ పేర్కొన్న సంగతి తెలిసిందే. మరి.. అచ్చం ధోనీలా ఉన్న ఈ వ్యక్తిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.
Breaking news!!!
Ms dhoni will lead csk in ipl 2023 😍💛 pic.twitter.com/Mm2bHUugZ7
— SPREAD.DHONISM 🦁™ (@Spreaddhonism7) May 20, 2022
The news we all were waiting for, a YES from MS Dhoni for IPL 2023. pic.twitter.com/JlhxX2pN0W
— Mufaddal Vohra (@mufaddal_vohra) May 20, 2022