న్యూజిలాండ్‌తో శుక్రవారం రాంచీ వేదికగా జరిగిన తొలి టీ20లో టీమిండియా ఓటమి పాలైనా.. యువ ఆటగాడు వాషింగ్టన్ సుందర్ తన ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అందరిని ఆకట్టుకున్నాడు. బౌలింగ్ మిగతా బౌలర్ల కంటే ఎంతో మెరుగ్గా బౌలింగ్ చేసిన సుందర్.. బ్యాటింగ్‌లో వీరోచిత పోరాటం చేశాడు. కేవలం 25 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుని.. టీ20ల్లో టీమిండియా తరఫున ఆరోస్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి అతి తక్కువ బంతుల్లో హాఫ్ సెంచరీ చేసిన ఆటగాడిగా.. రికార్డు సృష్టించాడు. గతంలో 26 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసిన దినేష్ కార్తీక్ నెలకొల్పిన రికార్డును బ్రేక్ చేశాడు. బౌలింగ్‌తో తన 4 ఓవర్ల కోటా పూర్తి చేసిన సుందర్.. కేవలం 22 పరుగులు మాత్రమే ఇచ్చి.. రెండు వికెట్లు సైతం తీసుకున్నాడు. ఆ రెండో వికెట్ కోసం తానే అద్భుతమైన క్యాచ్ కూడా పట్టాడు.
టీమిండియా మ్యాచ్ ఓడినప్పటికీ.. సుందర్ కనబర్చిన ప్రదర్శనపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. టీమిండియాకు మరో మంచి స్పిన్ ఆల్‌రౌండర్ దొరికాడంటూ క్రికెట్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా పేర్కొంటున్నారు. అయితే.. సుందర్ ఈ మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శన కనబర్చడం వెనుక టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే.. ఈ మ్యాచ్ కంటే ముందు వాషింగ్టన్ సుందర్, ధోని మధ్య సుదీర్ఘ సంభాషణ జరిగింది. తొలి వన్డే రాంచీ వేదికగా జరిగిన విషయం తెలిసిందే. రాంచీ ధోని సొంత ఊరు. మ్యాచ్ కోసం ఒక రోజు ముందుగానే రాంచీ క్రికెట్ స్టేడియానికి వచ్చిన భారత ఆటగాళ్లు ధోనితో ఇంట్రాక్ట్ అయ్యారు.
ఈ సందర్భంగా భారత ఆటగాళ్లతో చాలా సేపు మాట్లాడిన ధోని.. ముఖ్యంగా వాషింగ్టన్ సుందర్‌తో ఎక్కువ సేపు పలు విషయాలపై మాట్లాడాడు. రాంచీ పిచ్ కండీషన్, బౌలింగ్ ఎలా చేయాలి, బ్యాటింగ్ ఎలా ఆడాలనే విషయం సుందర్‌కు ధోని విలువైన సలహాలు ఇచ్చినట్లు సమాచారం. ధోనికి ఇది హోం గ్రౌండ్ కావడంతో పాటు కెప్టెన్‌గా తనకున్న నాలెడ్జ్‌తో సుందర్‌కు మంచి టిప్స్ చెప్పినట్లు, వాటితోనే సుందర్ బ్యాటింగ్, బౌలింగ్‌లో దుమ్మురేపినట్లు క్రికెట్ అభిమానులు భావిస్తున్నారు. ధోని కెప్టెన్‌గా ఉన్న సమయంలో టీమిండియా ఏ విధంగా నడిపించాడో ప్రత్యకంగా చెప్పాల్సిన పనిలేదు. తన పదునైన వ్యూహాలతో సాధారణ ఆటగాళ్లను సైతం స్టార్‌లను చేశాడు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Mahendra to Kumara Washi ✨
Scenes from Ranchi yesterday 🧡#OrangeArmy | @Sundarwashi5 @msdhoni pic.twitter.com/RWFpQ5b11o
— SunRisers Hyderabad (@SunRisers) January 28, 2023