మహేంద్ర సింగ్ ధోనీ.. ఈ పేరు చెప్పగానే ఐసీసీ ట్రోఫీలు, లెక్కలేనన్ని రికార్డులే గుర్తొస్తాయి. 2020లో రిటైర్మెంట్ ప్రకటించిన ధోనీ.. ప్రస్తుతం ఐపీఎల్ మాత్రమే ఆడుతున్నాడు. రీసెంట్ గా భారత్-న్యూజిలాండ్ రెండో టీ20 చూడటానికి వచ్చిన మహీ.. ఫ్యాన్స్ కి హ్యాపీనెస్ తెచ్చిపెట్టాడు. ఈ మధ్య తన నిర్మాణంలో తమిళంలో తొలి సినిమాను కూడా ప్రకటించాడు. పూజా కార్యక్రమం జరగ్గా.. ధోనీ భార్య సాక్షి క్లాప్ కొట్టింది. ఇప్పుడు సడన్ గా ధోనీ పోలీస్ అధికారి లుక్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యేసరికి అందరూ ఒక్కసారిగా స్టన్ అయిపోయారు.
ఇక విషయానికొస్తే.. ధోనీ క్రికెటర్ గా మాత్రమే కాకుండా బిజినెస్ మ్యాన్, యాక్టర్ గానూ అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటాడు. టెర్రిటోరియల్ ఆర్మీలో లెఫ్టినెంట్ కల్నల్ హోదా కూడా ఉంది. ఇక క్రికెటర్ గా అభిమానులకు దూరమైనప్పటికీ ప్రతి ఏడాది వేసవిలో జరిగే ఐపీఎల్ తో ఎంటర్ టైన్ చేస్తూనే ఉంటాడు. అలా ఈసారి కూడా టోర్నీ కోసం ప్రాక్టీసులో ఫుల్ నిమగ్నమైపోతున్నాడు. తాజాగా ధోనీకి సంబంధించిన పోలీస్ లుక్ ఒకటి బయటకొచ్చింది. అయితే ఇది కొత్త అడ్వర్టైజ్ మెంట్ కోసమేనని తెలుస్తోంది. ప్రస్తుతం ఇది కాస్త టాక్ ఆఫ్ ది టౌన్ అయిపోయింది.
సడన్ గా ఈ పిక్ చూసిన చాలామంది.. తన నిర్మాణంలో తీస్తున్న తమిళ సినిమాలో లుక్ అని పొరబడ్డారు. కానీ యాడ్ కోసమే అని తెలిసి రిలాక్స్ అయ్యారు. అయితే ధోనీని పోలీస్ ఆఫీసర్ గా చూసిన చాలామంది.. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రోహిత్ శెట్టి ‘కాప్ యూనివర్స్’లో హీరోలకు మించి ఉన్నాడని తెగ పొగిడేస్తున్నారు. ఏదేమైనా సరే ధోనీ ఇలా సడన్ సర్ ప్రైజ్ ఇచ్చేసరికి ఫ్యాన్స్ తెగ హ్యాపీగా ఫీలవుతున్నారు. మరి ధోనీ పోలీస్ లుక్ చూసి మీరేం అనుకున్నారు. కింద కామెంట్స్ లో మీ అభిప్రాయాన్ని పోస్ట్ చేయండి.
MS Dhoni as a police officer in an ad. pic.twitter.com/nleS9DR8bh
— Johns. (@CricCrazyJohns) February 2, 2023