క్రికెట్.. ఉత్కంఠకు, భావోద్వేగాలకు, వినోదానాకి పెట్టింది పేరు. ఇవే కాకుండా.. అప్పుడప్పుడు కొన్ని ఫన్నీ సంఘటనలు కూడా చోటు చేసుకుంటూ ఉంటాయి. అవి ప్రేక్షకులనే కాకుండా.. క్రికెటర్లను కూడా ఆశ్చర్యానికి గురిచేస్తుంటాయి. బ్యాటర్‌ను అవుట్ చేసేందుకు బౌలర్‌తో పాటు ఫీల్డింగ్ టీమ్ మొత్తం కాచుకుని ఉంటుంది. ఎప్పుడు ఏ చిన్న అవకాశం దొరికినా వదలరు. గట్టిగా అప్పీల్ చేస్తూ అంపైర్ చేయి ఎత్తి అవుట్ ఇచ్చేదాక వదలరు. అలాంటిది.. బ్యాటర్ క్లీన్ బౌల్డ్ అయినా కూడా పట్టించుకోకుండా ఉంది ఒక ఫీల్డింగ్ టీమ్. ఇంత నిద్రమత్తులో ఉన్నారా అంటూ క్రికెట్ ప్రపంచం నవ్వుకుంటుంది.
ఈ ఫన్నీ ఘటన ఆస్ట్రేలియా దేశవాళీ క్రికెట్లో చోటుచేసుకుంది. తాజాగా ఆస్ట్రేలియాలోని క్వీన్స్లాండ్, టాస్మానియా జట్ల మధ్య ఒక వన్డే మ్యాచ్ జరిగింది. ఈ సందర్భంగా క్వీన్స్లాండ్ బ్యాటర్ జార్జియా వోల్ 26 పరుగుల వద్ద .. సారా బౌలింగ్‌లో బౌల్డ్ అయింది. బంతి బ్యాట్‌ను దాటుకుంటూ వెళ్లి ఆఫ్ స్టంప్పైనున్న బెయిల్స్‌ను తాకుతూ వెళ్లింది. దీంతో అవి కిందపడ్డాయి. ఇదంతా క్షణాల్లో జరిగిపోయింది. అయినా అక్కడే ఉన్న కీపర్ ఈ విషయాన్ని గుర్తించలేదు.. మరోవైపు బౌలర్ అప్పీల్ చేయలేదు. దీంతో అంపైర్లు కూడా పట్టించుకోలేదు.
కీపర్ గ్లోవ్స్ తాకి బెయిల్స్ పడి ఉండొచ్చని అంతా అనుకున్నారు. దీంతో బ్యాటర్ కూడా ఈ విషయంలో మిన్నకుండిపోయింది. అయితే, రీప్లేలో ఆ బంతి బెయిల్స్ అంచులు తాకుతూ వెళ్లినట్లు స్పష్టంగా కనిపించింది. అయినా, అప్పటికే బ్యాటర్ బతికిపోయింది. చివరికి 31 పరుగుల వద్ద జార్జియా ఔటైంది. ఇక ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన క్వీన్స్లాండ్ 48 ఓవర్లకు (డక్‌వర్త్ లూయిస్ ప్రకారం) 223/6 స్కోర్ చేసింది. అనంతరం టాస్మానియా 232 పరుగులు చేసి విజయం సాధించింది.
ఇదీ చదవండి: కప్పు బూడిద కోసం ఆస్ట్రేలియా-ఇంగ్లండ్ మధ్య క్రికెట్ యుద్ధం!
ICYMI: An odd moment in the #WNCL yesterday after replays showed Belinda Vakarewa bowled Queensland opener Georgia Voll on 26, but no one appealed! pic.twitter.com/b8w2NXIEIW
— cricket.com.au (@cricketcomau) December 20, 2021