టీమిండియా స్పీడ్ స్టర్ జస్ప్రీత్ బుమ్రా గైర్హాజరీతో భారత బౌలింగ్ దళం వీక్ అయ్యింది. ఇక బుమ్రా స్థానాన్ని భర్తి చేయగల బౌలర్ కోసం టీమిండియా ఎదురుచూస్తోంది. అలాంటి టైమ్ లోనే టీమిండియాకు ఓ దొరికిన ఆణిముత్యం మహ్మద్ సిరాజ్. గత కొంత కాలంగా వన్డేలో అద్భుత ప్రదర్శన కనబరుస్తూ.. వన్డే ర్యాంకింగ్స్ లో అగ్రస్థానంలోకి దూసుకొచ్చాడు. 2019లో వన్డేల్లో 263వ స్థానంలో ఉన్న సిరాజ్ తాజాగా ఐసీసీ ప్రకటించిన బౌలర్ల వన్డే ర్యాంకింగ్స్ లో అగ్రస్థానంలోకి దూసుకొచ్చాడు. కివీస్ తో జరిగిన మూడు వన్డే మ్యాచ్ ల సిరీస్ లో రెండు మ్యాచ్ లు మాత్రమే ఆడాడు సిరాజ్.
ICC poster for the new No.1 Ranked ODI bowler – Mohammad Siraj. pic.twitter.com/QbDgnaaTrD
— Mufaddal Vohra (@mufaddal_vohra) January 25, 2023
మహ్మద్ సిరాజ్.. 2019లో వన్డే అరంగేట్రం చేసిన ఈ హైదరాబాదీ స్పీడ్ స్టర్ అతికొద్ది కాలంలో ప్రపంచ స్థాయి బౌలర్ గా గుర్తింపు పొందాడు. అయితే మధ్యలో కొంతకాలం ఫామ్ కోల్పోవడంతో జట్టులో స్థానం కోల్పోయాడు. అనంతరం జట్టులోకి తిరిగి వచ్చాక.. అద్భుతమైన ప్రదర్శనలో జట్టులో కీలక బౌలర్ గా అవతరించాడు. టీమ్ లోకి రీ ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి 20 వన్డేలు ఆడిన సిరాజ్ 37 వికెట్లు తీసి సత్తా చాటాడు. ఇన్నింగ్స్ ఆరంభంలో బ్యాటర్లకు చుక్కలు చూపిస్తున్నాడు సిరాజ్. ఈ నేపథ్యంలోనే తాజాగా ఐసీసీ రిలీజ్ చేసిన వన్డే బౌలర్స్ ర్యాంకింగ్స్ లో 729 రేటింగ్ పాయింట్లతో నెంబర్ వన్ స్థానంలోకి దూసుకొచ్చాడు. సిరాజ్ తర్వాత 727 పాయింట్లతో ఆసిస్ బౌలర్ హేజిల్ వుడ్ రెండో స్థానంలో ఉండగా.. మూడవ ప్లేస్ 708 పాయింట్లతో బౌల్ట్ ఉన్నాడు. మరి సిరాజ్ వరల్డ్ నెంబర్ వన్ బౌలర్ గా ఎదగడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
🚨 There’s a new World No.1 in town 🚨
India’s pace sensation has climbed the summit of the @MRFWorldwide ICC Men’s ODI Bowler Rankings 🔥
More 👇
— ICC (@ICC) January 25, 2023