క్రికెట్ లో ఆటగాళ్లకు ముఖ్యంగా ఉండాల్సింది క్రీడాస్ఫూర్తి. ఆ క్రీడాస్ఫూర్తే ప్లేయర్స్ ను గొప్ప ఆటగాళ్లుగా ప్రపంచంలో నిలబెడుతుంది. అయితే కొన్ని కొన్ని సందర్భాల్లో కొంతమంది ఆటగాళ్లు సహనం కోల్పోతుంటారు. ఆ క్రమంలో ఇతర సహచర ఆటగాళ్లపై నోరుజారుతుంటారు. ఇలాంటి సంఘటనలు క్రికెట్ లో చాలానే చూశాం. అలాంటి సంఘటనే తాజాగా సౌతాఫ్రికా వర్సెస్ ఆస్ట్రేలియాలో మ్యాచ్ లో చోటుచేసుకుంది. ఆస్ట్రేలియా బౌలర్ మిచెల్ స్టార్క్.. దక్షిణాఫ్రికా బ్యాటర్ అయిన డి బ్రుయిన్ కు వార్నింగ్ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
సౌతాఫ్రికా జట్టు ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉంది. మూడు టెస్టు మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా రెండు టెస్టుల్లో ఘోరంగా ఓడిపోయింది ప్రోటీస్ జట్టు. తాజాగా మెల్బోర్న్ వేదికగా జరిగిన రెండో టెస్ట్ లో ఓ ఆసక్తికరమైన సంఘటన చోటుచేసుకుంది. రెండో ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ ఆరంభించిన దక్షిణాఫ్రికా జట్టు ఆస్ట్రేలియా పేస్ బౌలింగ్ ను ఎదుర్కొవడంలో తీవ్ర ఇబ్బందులు పడింది. ఈ క్రమంలోనే 47 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది దక్షిణాఫ్రికా జట్టు. అప్పుడు క్రీజ్ లోకి వచ్చాడు టెంబా బావుమా. మరోవైపు డి బ్రుయిన్ ఉన్నాడు. ఈ క్రమంలోనే బౌలింగ్ కు దిగాడు మిచెల్ స్టార్క్. బావుమా బ్యాటింగ్ చేస్తుండగా.. నాన్ స్ట్రైకర్ గా డి బ్రుయిన్ ఉన్నాయి.
“Stay in your crease, it’s not that hard!”
Part 2 of Starc v de Bruyn 👀 #AUSvSA pic.twitter.com/I6bPWXAOSX
— 7Cricket (@7Cricket) December 29, 2022
అయితే మిచెల్ స్టార్క్ బౌలింగ్ వేస్తుండగా, బాల్ వేయకముందే బ్రుయిన్ క్రీజ్ వదిలిపెట్టి వెళ్లాడు. దాంతో అసహనానికి గురైన స్టార్క్.. క్రీజ్ లో ఉండొచ్చు కదా? అది అంత కష్టమైన పని కాదుకదా అని స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు. అంటే ఒకవింధంగా మరోసారి ఇలా చేస్తే.. మన్కడింగ్ చేస్తా అని చెప్పకనే చెప్పాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఈ మ్యాచ్ లో చేతికి గాయం అయినప్పటికీ బౌలింగ్ చేశాడు స్టార్క్. మ్యాచ్ విషయానికి వస్తే.. తొలి ఇన్నింగ్స్ లో 575/8 పరుగులకు ఆస్ట్రేలియా డిక్లెర్డ్ ఇవ్వగా, దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్ లో 189 కుప్పకూలగా, రెండో ఇన్నింగ్స్ లో సైతం 204 పరుగులకే ఆలౌట్ అయ్యి.. ఇన్నింగ్స్ 182 పరుగుల తేడాతో ఓడిపోయింది.
👀👀 #AUSvSA pic.twitter.com/xkb0CRj1T1
— 7Cricket (@7Cricket) December 28, 2022