వయస్సు పైబడితేనో.. సరిగా రాణించలేనప్పుడో ఆటగాళ్లు కెరీర్ కు ముగింపు పలకడం సహజం. లేదంటే బాగా రాణించాక కెరీర్ ఉన్నత దశలో ఉన్నప్పుడు రిటైర్మెంట్ ప్రకటిస్తారు. కానీ, ఈ క్రికెటర్ తీసుకున్న నిర్ణయం ఇందులో ఏ కోవకు చెందింది కాదు. అవకాశాలు రాక.. వేచి చూసి సమయాన్ని వృధా చేసుకోలేక కఠిన నిర్ణయం తీసుకున్నాడు.
క్రికెట్ లో ఆటగాళ్లకు ముఖ్యంగా ఉండాల్సింది క్రీడాస్ఫూర్తి. ఆ క్రీడాస్ఫూర్తే ప్లేయర్స్ ను గొప్ప ఆటగాళ్లుగా ప్రపంచంలో నిలబెడుతుంది. అయితే కొన్ని కొన్ని సందర్భాల్లో కొంతమంది ఆటగాళ్లు సహనం కోల్పోతుంటారు. ఆ క్రమంలో ఇతర సహచర ఆటగాళ్లపై నోరుజారుతుంటారు. ఇలాంటి సంఘటనలు క్రికెట్ లో చాలానే చూశాం. అలాంటి సంఘటనే తాజాగా సౌతాఫ్రికా వర్సెస్ ఆస్ట్రేలియాలో మ్యాచ్ లో చోటుచేసుకుంది. ఆస్ట్రేలియా బౌలర్ మిచెల్ స్టార్క్.. దక్షిణాఫ్రికా బ్యాటర్ అయిన డి బ్రుయిన్ కు వార్నింగ్ ఇచ్చాడు. […]