ఇంగ్లండ్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న యాషెస్ సిరీస్‌లో భాగంగా అడిలైడ్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్‌కి తగలరాని చోట బంతి తగిలింది. ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ విసిరిన బంతిని డిఫెన్స్ ఆడేందుకు జో రూట్ ప్రయత్నించాడు. కానీ.. బంతి అతను ఊహించని విధంగా టర్న్ అయ్యి బ్యాట్‌కు తగలకుండా నేరుగా వచ్చి సేఫ్ గార్డ్‌కి తాకింది.
నొప్పితో విలవిల్లాడిన జో రూట్ అలానే క్రీజులో పడుకుండిపోయాడు. కాసేపటి తర్వాత తేరుకున్న జో రూట్ బ్యాటింగ్ కొనసాగించాడు. కానీ.. ఎక్కువ సేపు మాత్రం క్రీజులో నిలువలేకపోయాడు. మిచెల్ స్టార్క్ విసిరిన బంతి తగిలిన తర్వాత వికెట్ల మధ్య జో రూట్ చాలా అసౌకర్యంగా పరుగెత్తుతూ కనిపించాడు. దాంతో.. కామెంట్రీ బాక్స్‌లో ఉన్న ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రిక్కీ పాంటింగ్ పడిపడి నవ్వుతూ కనిపించాడు. చివరికి 24 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లోనే అలెక్స్ క్యారీకి సులువైన క్యాచ్ ఇచ్చి జో రూట్ ఔటయ్యాడు.
ఈ మ్యాచ్‌లో 468 పరుగుల లక్ష్యఛేదనకు దిగిన ఇంగ్లాండ్ టీమ్ 59 ఓవర్లు ముగిసే సమయానికి 106/6తో ప్రస్తుతం ఎదురీదుతోంది. ఈ డే/నైట్ టెస్టులో పిక్ బాల్‌తో జరుగుతుంది. అడిలైడ్ పిచ్‌పై ఒక్కోసారి బంతి అనూహ్యంగా బౌన్స్ అవుతూ.. మరోసారి అనూహ్యంగా టర్న్ అవుతుంది. దాంతో.. మ్యాచ్‌లో నాలుగో రోజైన ఆదివారం ఇంగ్లాండ్ బ్యాటర్లు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. సోమవారం కూడా అవే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పటికే గబ్బా వేదికగా ముగిసిన తొలి టెస్టు 9 వికెట్ల తేడాతో గెలిచిన ఆస్ట్రేలియా.. ఐదు టెస్టుల యాషెస్ సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో ఉంది.
ఇదీ చదవండి: యాషెస్ సిరీస్ లో ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్ అరుదైన ఘనత..
Struck before play with no protector, the Aussies had ‘a lot of sympathy’ for Joe Root after a second brutal blow to the 🍒 #Ashes | @alintaenergy pic.twitter.com/LOosZ8iRST
— cricket.com.au (@cricketcomau) December 19, 2021