క్రికెట్ లో స్లెడ్జింగ్ చేయడం ఆసీస్ కి కొత్తేమి కాదు. గతంలో వీరు చాలా సార్లు ఇలా చేసి విమర్శలకు గురయ్యారు. అయితే తాజాగా మరోసారి ఛీటింగ్ చేస్తూ ఇంగ్లాండ్ అభిమానుల ఆగ్రహానికి కారణమవుతున్నారు. స్మిత్ పట్టిన క్యాచ్ ఇపుడు వివాదాస్పదమవుతుంది.
క్రికెట్ లో స్లెడ్జింగ్, ఛీటింగ్ ఇలా ఏవి చేయాలన్నా ఆసీస్ ఆటగాళ్లు ముందు ముందే ఉంటారు. వీరిపై ఎప్పటి నుండో ఛీటింగ్ అనే ముద్ర ఉంది. ఎన్నో ఏళ్లుగా ఉన్న ఈ అలవాటును వీరు ఇప్పటికీ కొనసాగించడం క్రికెట్ ఫ్యాన్స్ కి నచ్చడం లేదు. బాల్ టాంపరింగ్ ఉదంతంలో స్మిత్, వార్నర్, బాన్ క్రాఫ్ట్ మీద ఒక సంవత్సరం పాటు బ్యాన్ విధించినా వీరు మాత్రం తమ తీరు మార్చుకోవడం లేదు. డబ్ల్యూటీసీ ఫైనల్లో భాగంగా గిల్ క్యాచ్ ని అందుకున్న గ్రీన్ అది నేల మీద పెట్టినట్టు తెలిసినా.. దానిని కవర్ చేస్తూ సెలబ్రేషన్ చేసుకున్నాడు. ఇక యాషెస్ లో లబుషేన్ కూడా ఇదే ఫాలో అయ్యాడు. అయితే తాజాగా స్మిత్ పట్టిన వివాదాస్పద క్యాచ్ మరోసారి చర్చనీయాంశమైంది.
యాషెస్ లో భాగంగా లార్డ్స్ లో జరుగుతున్న రెండో టెస్టు నువ్వా , నేనా అన్నట్లుగా జరుగుతుంది. తొలి ఇన్నింగ్స్ లో 416 పరుగులకి ఆస్ట్రేలియా ఆలౌట్ అయింది. స్మిత్ (110) ఆసీస్ ఇన్నింగ్స్ లో హైలెట్ గా నిలిచింది. ఇక ఆ తర్వాత ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లాండ్ కూడా ధీటుగా బదులిస్తుంది. రెండో రోజు ఆట ముగిసేసరికి 4 వికెట్లను 278 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ లో ఓపెనర్ బెన్ దాకెట్ (98) తృటిలో సెంచరీ మిస్ చేసుకోగా మిగిలిన వారందరూ కూడా తలో చేయి వేశారు. ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ అంతా కూడా ధాటిగా సాగడం గమనార్హం. అయితే ఈ మ్యాచులో రూట్ క్యాచ్ ని స్మిత్ అందుకున్న తీరు వివాదాస్పదమవుతోంది. స్మిత్ క్యాచ్ ని క్లియర్ గా నెల మీద పెట్టినట్లుగా తెలిసినా అంపైర్ అవుట్ గా ప్రకటించడం ఇప్పుడు ఇంగ్లాండ్ అభిమానులు ఫైర్ అవుతున్నారు.
ఇంగ్లాండ్ ధాటిగా ఆడుతున్న సమయంలో ఆసీస్ ఆటగాళ్లు షార్ట్ బాల్స్ వేస్తూ ఇంగ్లీష్ బ్యాటర్లని ఇబ్బందికి గురి చేశారు. పోప్, దక్కెట్ కూడా షార్ట్ బాల్స్ పేస్ చేయలేక క్యాచ్ ఇచ్చి పెవిలియన్ కి చేరారు. ఇక ఇంగ్లాండ్ స్టార్ ఆటగాడు రూట్ కి కూడా ఇదే తరహా ఫీల్డింగ్ సెట్ చేసాడు. మిచెల్ స్టార్క్ వేసిన 46వ ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. పుల్ షాట్ కి ఆడబోయిన జో రూట్ స్మిత్ డైవింగ్ క్యాచ్ తో నిష్క్రమింవచ్చాడు. అయితే బంతి పూర్తిగా అతడి చేతిలో లేకపోయినా థర్డ్ అంపైర్ రూట్ ఔటని ప్రకటించడం వివాదాస్పదమైంది. థర్డ్ అంపైర్ నిర్ణయం ఆసీస్ కి అనుకూలంగా రావడం ఆశ్చర్యంగా మారింది. మరోసారి స్మిత్ ఛీటింగ్ చేశాడంటూ నెటిజన్స్ ఏకిపారేస్తున్నారు . మరి స్మిత్ పట్టిన క్యాచ్ మీకేవిధంగా అనిపించిందో కామెంట్ల రూపంలో తెలపండి.