యాషెస్ లో భాగంగా జో రూట్ పరుగుల వరద పారిస్తున్నాడు. తొలి ఇన్నింగ్స్ లో సెంచరీ చేసిన ఈ స్టార్ బ్యాటర్.. రెండో ఇన్నింగ్స్ లో 46 పరుగులతో రాణించాడు. దీంతో రూట్ ఇప్పుడు సచిన్ ఆల్ టైం రికార్డుపై గురి పెట్టాడు.
ప్రస్తుత జనరేషన్ లో విరాట్ కోహ్లీ, స్టీవ్ స్మిత్, కేన్ విలియమ్సన్, జో రూట్ ఫ్యాబ్ ఫోర్ గా కొనసాగుతున్నారు. ఫార్మాట్ కి తగ్గట్లుగా టెక్నీక్ మార్చుకొని ఆడడం వీరి స్పెషాలిటీ. టీ 20, వన్డే ఫార్మాట్ లో కోహ్లీ వీరి ముగ్గురి కన్నా బాగా ఆడతాడని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రికార్డులు, పరుగుల పరంగా కోహ్లీ వీరికి అందనంత ఎత్తులో ఉన్నాడు. ఈ క్రమంలో వన్డేల్లో సచిన్ రికార్డులు ఒకొక్కటి బ్రేక్ చేస్తూ వస్తున్న కోహ్లీ.. భవిష్యత్తులో టెండూల్కర్ ఆల్ టైం బ్రేక్ చేస్తాడనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే టెస్టుల్లో మాత్రం సచిన్ అత్యధిక పరుగుల రికార్డ్ బద్దలు కొట్టే అవకాశం ఇంగ్లాండ్ స్టార్ ప్లేయర్ రూట్ కే ఎక్కువగా ఉంది. వీరు నలుగురు అత్యున్నత ఫామ్ లో ఉన్నా రూట్ మాత్రం వీరికి అందకుండా వెళ్ళిపోతున్నాడు.
యాషెస్ లో భాగంగా జో రూట్ పరుగుల వరద పారిస్తున్నాడు. తొలి ఇన్నింగ్స్ లో సెంచరీ చేసిన ఈ స్టార్ బ్యాటర్.. రెండో ఇన్నింగ్స్ లో 46 పరుగులతో రాణించాడు. దీంతో ప్రస్తుతం టెస్టుల్లో రూట్ పరుగులు 11168 కి చేరుకుంది. 32 ఏళ్ళ రూట్ మరో 4,5 ఏళ్ళు నిలకడగా ఆడినా .. చాలా ఈజీగా సచిన్ రికార్డ్ బ్రేక్ చేసే అవకాశం ఉంది. మరోవైపు స్టీవ్ స్మిత్, విరాట్ కోహ్లీ, విలియంసన్ ఇంకా 9000 పరుగుల క్లబ్ లో చేరలేదు. పైగా వీరందరిలో రూట్ వయసులో చిన్నవాడు కావడం, ఇంగ్లాండ్ టెస్టులకి ఎక్కువగా ప్రాధాన్యం ఇవ్వడం లాంటి అంశాలు రూట్ కి అనుకూలంగా మారనున్నాయి. ఇక ఒకప్పుడు కోహ్లీ కూడా ఈ రేస్ లో ఉన్నా.. గత రెండేళ్లుగా కోహ్లీ టెస్టుల్లో విఫలమవుతున్న సంగతి తెలిసిందే. పైగా కోహ్లీ యావరేజ్ కూడా 50 లోపు ఉండడం గమనార్హం. దీంతో రూట్ తర్వాత సచిన్ ఆల్ టైం రికార్డ్ బ్రేక్ చేసే అవకాశం రూట్ తర్వాత స్మిత్, విలియంసన్ కే ఉంది.
ఇక యాషెస్ లో భాగంగా తొలి టెస్టు మ్యాచ్ ఆసక్తికరంగా జరుగుతుంది. 280 పరుగుల ఊరించే లక్ష్యాన్ని ఆసీస్ మీద ఉంచింది ఇంగ్లాండ్ . నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్లను 107 పరుగులు చేసింది. క్రీజ్ లో ఓపెనర్ ఖవాజా(34), నైట్ వాచ్ మెన్ బొలాండ్(13) ఉన్నారు. చివరి రోజు ఆస్ట్రేలియా గెలవాలంటే 174 పరుగులు అవసరం కాగా.. ఇంగ్లాండ్ గెలవాలంటే మరో 7 వికెట్లు తీయాలి. వర్షం ముప్పు కూడా ఉండడంతో డ్రా అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మొత్తానికి రూట్ భవిష్యత్తులో కూడా ఇంతే నిలకడ చూపించగలడా? లేకపోతే సచిన్ ఆల్ టైం రికార్డుని మరొకరు బ్రేక్ చేస్తారో చూడాలి. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలపండి.