క్రీడాలోకంలో ఏ ఆటగాడికైనా ఒకానోక దశలో గడ్డు పరిస్థితులు ఎదురుకావడం సహజం. అప్పుడు అతడిపై విమర్శలు రావడమూ సాధారణమే. అయితే వాటిని ఎదుర్కొని మళ్లి ఫామ్ ను కొనసాగించడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. ఈ క్రమంలోనే మయాంక్ అగర్వాల్ ఫామ్ పై తీవ్ర విమర్శలతో పాటు పంజాబ్ కెప్టెన్సీ పగ్గాల నుంచి తొలగిస్తున్నట్లు వార్తలు వస్తోన్నాయి. అయితే ఈ వార్తలకు అతడు తన బ్యాట్ తోనే సమాధానం ఇస్తూ వరుస సెంచరీలతో దూసుకెళ్తున్నాడు. మరిన్ని వివరాల్లోకి వెళితే..
మయాంక్ అగర్వాల్.. భారత జట్టులో కీలక ఆటగాడు అయినప్పటికీ తనకు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడంలో విఫలం అవుతున్నాడు. దీంతో జట్టులోకి వస్తూ పోతూ ఉన్నాడే తప్ప నిలకడగా జట్టులో స్థానాన్ని మాత్రం పదిలపరుచుకోవట్లేదు. అదీ కాక యువ ఆటగాళ్లు తమదైన శైలిలో రాణిస్తుండటంతో టీంలో చోటు కోసం తీవ్ర పోటీ నెలకొంది. ఇక గత కొంత కాలంగా ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడుతోన్న మయాంక్ ను పంజాబ్ కెప్టెన్సీ నుంచి తొలగించాలని పంజాబ్ యాజమాన్యం భావిస్తున్నట్లు ఐపీఎల్ వర్గాల్లో చర్చలు నడుస్తోన్నట్లు వినికిడి.
ఈ నేపథ్యంలోనే మహారాజ ట్రోఫిలో భాగంగా బెంగళూర్ బ్లాస్టర్స్ తరపున ఆడుతున్న మయంక్ ప్రత్యర్థులపై ఫోర్లు, సిక్స్ లతో విరుచుకుపడుతున్నాడు. ఈ క్రమంలోనే గుల్భర్గా మైస్టిక్స్ తో జరిగిన మ్యాచ్ తో తన విశ్వరూపాన్ని చూపించాడు. కేవలం 61 బంతుల్లోనే 9 ఫోర్లు, 6 సిక్స్ లతో 112 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. మయాంక్ 58 బంతుల్లోనే తన సెంచరీని పూర్తి చేసుకున్నాడు. దీంతో బెంగళూర్ బ్లాస్టర్స్ 20 ఓవర్లలో 227 పరుగుల భారీ లక్ష్యాన్ని ప్రత్యర్థి ముందు ఉంచింది. ఇక లక్ష్య చేధనలో గుల్బర్గా 183 పరుగులకు ఆలౌట్ అయ్యి 44 రన్స్ తో ఓడిపోయింది.
అయితే తాజాగా అతడి ఫామ్ పై వస్తోన్న విమర్శలకు తన బ్యాట్ తోనే మయాంక్ సమాధానం చెప్పాడు. మయాంక్ వరుసగా భారీ స్కోర్లు సాధిస్తుండటంతో పంజాబ్ యాజమాన్యం ఆలోచనలో పడ్డట్లు తెలుస్తోంది. పంజాబ్ యజమాని ప్రీతిజింటా మయంక్ అగర్వాల్ గురించి మరో సారి థింక్ చేయాలి అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఎన్ని మార్పులు చేసినా పంజాబ్ జట్టు జట్టు తలరాత మాత్రం మారడంలేదు.
ఐపీఎల్ ప్రారంభం నుంచి ఉన్నాకానీ ఒక్కటంటే ఒక్క ఐపీఎల్ కప్ కూడా గెలవలేదు. దీంతో కెప్టెన్ కమ్ కోచ్ ల మార్పు కు శ్రీకారం చుట్టాలనుకున్న యాజమాన్యానికి ఇప్పుడు పెద్ద తల నొప్పి రానుంది. వరుసగా భారీ స్కోర్లు చేస్తున్న మయాంక్ ను ఉంచాలా.. తీసెయ్యాలా అనే డైలమా మేనెజ్ మెంట్ కు భారంగా మారింది అని క్రికెట్ వర్గాల సమాచారం. మరి ఈ విషయపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Runs: 112*
Balls: 61
Fours: 9
Sixes: 6
SR: 183.61Mayank Agarwal blasts his way to a brilliant 💯, his second of the tournament to guide his side to a gigantic total 🔥#MaharajaCup #CaptainPunjab #SaddaPunjab #PunjabKings #MayankAgarwal #KSCA @mayankcricket pic.twitter.com/V8zBBgXkuE
— Punjab Kings (@PunjabKingsIPL) August 23, 2022
Mayank Agarwal smashes his 2nd Century of the tournament for Bengaluru Blasters #Maharajatrophy #mayankagarwal #bengalurublasters pic.twitter.com/2gChgrotad
— Extra Pace (@Extra_Pace) August 23, 2022
Our very own super star Kichcha Sudeep with the Man of the Match between Kalyani Bengaluru Blasters and Gulbarga Mystics – Mayank Agarwal!!@KicchaSudeep @mayankcricket #MaharajaTrophy #KSCA #T20 #Cricket #Karnataka #IlliGeddavareRaja #ಇಲ್ಲಿಗೆದ್ದವರೇರಾಜ pic.twitter.com/Bl01qsKYQA
— Maharaja Trophy T20 (@maharaja_t20) August 24, 2022