21 ఏళ్ల కుర్రాడు చిచ్చరపిడుగులా రెచ్చిపోయాడు. వచ్చిన బంతిని వచ్చినట్లు బౌండరీలైన్ దాటించాడు. బౌలర్ ఎవరైనా, బంతులు ఎలాంటివైనా లెక్కచేయలేదు. ఎంతమంది బౌలర్లను మార్చిన అతని బ్యాటింగ్‌పై ఏ మాత్రం ప్రభావం చూపలేదు. చూడచక్కటి షాట్లతో విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడి.. కేవలం 42 బంతుల్లోనే సెంచరీ బాదేశాడు. ఈ సంచలన ఇన్నింగ్స్‌ను రోహన్ పాటిల్ అనే కుర్రాడు కర్ణాటక టీ20 లీగ్‌లో ఆడాడు. మంగళవారం బెంగుళూరు బ్లాస్టర్స్, గుల్బర్గా మిస్టక్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో రోహన్ చెలరేగిపోయాడు. బెంగుళూరు బ్లాస్టర్స్ నిర్దేశించిన 227 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. గుల్బర్గా తరపున ఆడుతూ.. ఓపెనర్‌గా వచ్చిన రోహన్ ఫోర్లు, సిక్సులతో బెంగుళూరు బ్లాస్టర్స్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. భారీ భారీ షాట్లతో హోరెత్తించాడు. అతను కొడుతున్న షాట్లు ఎన్ని సార్లు చూసినా మళ్లీమళ్లీ చూడాలనించేలా ఉన్నాయి. గ్రౌండ్‌కు అన్ని వైపులా అద్భుతమైన షాట్లు ఆడి.. కేవలం 49 బంతుల్లో 10 ఫోర్లు, 7 సిక్సులతో 108 పరుగులు చేశాడు. అలాగే 42 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేయడం విశేషం. కానీ.. 18వ ఓవర్లో దురదృష్టవశాత్తు రనౌట్ అయ్యాడు. ఇక రోహన్‌కు మిగతా బ్యాటర్లు సహకరించకపోవడంతో ఈ మ్యాచ్‌లో గుల్బర్గా ఓటమి చవిచూసింది. కానీ.. రోహన్ ఆడిన ఇన్నింగ్స్‌పై మాత్రం సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తుంది. ఇక మ్యాచ్‌లో రోహన్ ప్రదర్శన చూసిన ఆర్సీబీ అభిమానులు.. అతన్ని 2023 ఐపీఎల్లో ఆర్సీబీలోకి తీసుకోవాలంటూ సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి ఇన్నింగ్స్‌లు ఇంకో రెండు ఆడితే అతని ఆర్సీబీలో చోటు ఖాయం అంటూ పలువురు క్రికెట్ నిపుణులు సైతం అభిప్రాయపడుతున్నారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బెంగుళూరు బ్లాస్టర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 227 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఆ జట్టు కెప్టెన్ మయాంక్ అగర్వాల్ 61 బంతుల్లో 9 ఫోర్లు, 6 సిక్సులతో 112 పరుగులు చేసి జట్టుకు భారీ స్కోర్ అందించాడు. 228 పరుగుల భారీ లక్ష్యఛేదనలో గుల్బర్గా జట్టు తడబడింది. రోహన్ పాటిల్(108) తప్ప మిగతా జట్టు మొత్తం దారుణంగా విఫలం అయింది. దీంతో బెంగుళూరు బ్లాస్టర్స్ టీమ్ 44 పరుగుల తేడాతో విజయం సాధించింది. మరి ఈ మ్యాచ్‌లో అద్భుతంగా రాణించిన యువ క్రికెటర్ రోహన్ పాటిల్ ప్రదర్శనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి. ఇది కూడా చదవండి: ఎవడ్రా పుజారా టెస్టు ప్లేయర్ అన్నది..? 20 ఫోర్లు, 2 సిక్సులతో విధ్వంసం Karnataka's latest batting sensation Rohan Patil. @GulbargaMystics pic.twitter.com/2jxiy5NB9o — Vamos ️ (@VamosRCB_) August 13, 2022