మన సక్సెస్‌ను మనకంటే ఎక్కువ సెలబ్రెట్ చేసుకునే వ్యక్తుల్లో తల్లిదండ్రులు కాకుండా ఇంకా ఏవరన్న ఉన్నారంటే కచ్చితంగా అతను మన ప్రాణ స్నేహితుడై ఉంటాడు. అలాంటి ఫ్రెండ్ మనతో పాటే సేమ్ ప్రొఫెషన్‌లో ఉంటే.. మనకు కొండంత బలం ఉన్నట్లే. ప్రస్తుతం ఈ ఫ్రెండ్‌షిప్ మ్యాజిక్‌ను టీమిండియా ఓపెనర్లు కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్ అనుభవిస్తున్నారు. వీరిద్దరు మంచి ఫ్రెండ్స్ అన్న విషయం క్రికెట్ అభిమానులందరికీ తెలిసిందే.
కానీ వీళ్ల స్నేహం మొదలైంది మాత్రం ఇప్పుడు కాదు. వీళ్లిద్దరు బచ్‌పనకా దోస్తులు. చిన్నతనం నుంచే మంచి ఫ్రెండ్స్ అయిన రాహుల్-మయాంక్.. అండర్13 నుంచి కలిసే క్రికెట్‌లో పాఠాలు నేర్చుకున్నారు. ఇక అక్కడి నుంచి వీరిద్దరు వెనుతిరిగి చూసుకోలేదు. అండర్ 19 అయినా, దేశవాళీ టోర్నీల్లో అయినా.. ఇద్దరు జంటగా అదరగొట్టేవారు. కర్ణాటక తరపున ఇద్దరు అనేక మ్యాచ్‌లలో ఓపెనర్లుగా ఆడారు. అనంతరం ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్‌లో కూడా వీరిద్దరూ కలిసే ఆడారు.
Playing for Same College team In Bangalore ✅
Playing for Karnataka at Ranji ✅
Playing for India U19 ✅
Playing for PBKS in IPL ✅
Playing for India in Tests ✅.. and much moreFriendship Goals: KL Rahul 😍 Mayank Agarwal@klrahul11 @mayankcricket pic.twitter.com/YFXhtWOQnl
— Dravid in air 🥶 (@Dravidsrihari) December 26, 2021
ఈ జోడికి అండర్‌స్టాడింగ్ ఫ్రెండ్‌షిప్‌తోనే వచ్చింది
ఓపెనర్లుగా రాహుల్-మయాంక్ మధ్య ఇంతమంచి అండర్‌స్టాడింగ్ ఉండేందుకు ప్రధాన కారణం వారి మధ్య ఉన్న ఫ్రెండ్‌షిప్. ఇద్దరికి ఒకరి గురించి ఒకరికి బాగా తెలుసు గనుక.. ఎలాంటి పరిస్థితుల్లో ఎలా రియాక్ట్ అవుతారో.. ఎలాంటి సందర్భాల్లో ఎలా ఆడాతారో అర్థం అవుతుంది. దీంతో పరుగుల కోసం కేవలం సైగలతోనే మెరుపుతీగల్లా కదులుతారు. అందుకే వీరి జోడిలో రన్‌అవుట్ అవ్వడం అరుదు. ఇక ఇప్పుడు సౌతాఫ్రికాతో జరుగుతున్న టెస్ సిరీస్‌లోనూ కేఎల్ రాహుల్-మయాంక్ అగర్వాల్ జోడి అదరగొట్టింది. మొదటి వికెట్‌కు 117 పరుగుల భాగస్వాయ్యంతో జట్టుకు బలమైన పునాది వేశారు. మయాంక్ 60 పరుగులు, రాహుల్ సెంచరీతో మెరిశారు.
KL Rahul and Mayank Agarwal’s journey over the years..#KLRahul #MayankAgarwal
For discussions, conversations, analysis and much more, visit our India TV Cricket YT channel now at https://t.co/xTmfG8x64Q pic.twitter.com/xTyen5gEiD
— IndiaTVSports (@IndiaTVSports) December 27, 2021
సక్సెస్ ఒక్కరిదైనా.. సెలబ్రెషన్ ఇద్దరిదీ..
రాహుల్-మయాంక్ జోడిలో ఏ ఒక్కరు రాణించినా.. ఆ సక్సెస్ తమదే అన్నట్లు మరొకరు ఆనందపడతారు. ఈ విషయం ఆదివారం మరోసారి రుజువైంది. కేఎల్ రాహుల్ సెంచరీ చేసి సందర్భంగా డ్రెస్సింగ్ రూమ్‌లో ఉన్న మయాంక్ అగర్వాల్ లేచి నిల్చుని మరీ చప్పట్లు కొడుతూ.. అభినందిస్తూ.. ఆనందపడ్డాడు. ఇలా ఒకరి సక్సెస్‌ను మరొకరు ఎంజాయ్ చేస్తారు. మరి ఈ ఫ్రెండ్‌షిప్ జోడిపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
And ….once again a great century
Classical #KLRahul And a amazing @KLrahul_ ……#BCCI #ICC @klrahul11 pic.twitter.com/vQyrHeOpKt— arjun sirra (@arjunsirra) December 27, 2021