టీమిండియా స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్ మరోమారు తన మంచితనాన్ని చాటుకున్నాడు. సాయం చేయమంటూ తన దగ్గరకు వచ్చిన పేద విద్యార్థికి అండగా నిలిచాడు రాహుల్.
టీమిండియా సీనియర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. అనతి కాలంలోనే భారత జట్టులో కీలక ప్లేయర్‌గా ఎదిగాడు రాహుల్. బ్యాటింగ్‌తో పాటు కీపింగ్‌లోనూ రాణిస్తూ టీమ్ సక్సెస్‌లో తనదైన పాత్ర పోషిస్తున్నాడు. అయితే కొంతకాలంగా మాత్రం రాహుల్ తరచూ ఫెయిల్ అవుతున్నాడు. ఇంటర్నేషనల్ క్రికెట్‌తో పాటు ఈ ఏడాది జరిగిన ఐపీఎల్‌లోనూ రాహుల్ అంతగా ఆకట్టుకోలేదు. ఇక, ఐపీఎల్లో ఆడుతూ గాయమవ్వడంతో అతడు టోర్నీకి దూరమయ్యాడు. ఇంజ్యురీ నుంచి కోలుకోకపోవడంతో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లోనూ ఆడలేకపోయాడు. లండన్‌లో సర్జరీ జరిగాక.. ప్రస్తుతం అతడు రెస్ట్ తీసుకుంటున్నాడు. అయితే రాహుల్ తన మంచితనాన్ని మరోసారి చాటుకున్నాడు. ఉన్నత చదువులకు ఫీజులు కట్టేందుకు డబ్బులు లేక ఇబ్బంది పడుతున్న ఒక పేద విద్యార్థికి తాను ఉన్నానని భరోసా ఇచ్చాడు రాహుల్.
కర్నాటక, మహాలింగాపూర్కు చెందిన అమృతన్ మావింకట్టి అనే స్టూడెంట్ ఇటీవల పీయూసీ కామర్స్ రిజల్ట్స్‌లో 600 మార్కులకు 571 మార్కులు తెచ్చుకున్నాడు. అయితే ఉన్నత చదువుల కోసం కేఎల్ఈ ఇన్స్టిట్యూట్లో సీఏ కోచింగ్‌కు వెళ్లాడు. అడ్మిషన్ దక్కాలంటే యాజమాన్య బోర్డుకు రూ.75 వేలు చెల్లించాల్సి వచ్చింది. కానీ రూ.25 వేలు మాత్రమే సర్దుబాటు అయ్యాయి. కుటంబ ఆర్థిక పరిస్థితి బాగోలేక ఫీజు కట్టేందుకు ఇబ్బంది పడుతున్న అమృతన్ గురించి కేఎల్ రాహుల్‌కు తెలిసింది. దీంతో అతడి విద్యాభ్యాసానికి సంబంధించిన ఖర్చులను భరించేందుకు ముందుకు వచ్చాడు కేఎల్ రాహుల్. అమృతన్ కాలేజీ ఫీజును చెల్లించడంతో పాటు అతడికి వసతి, పుస్తకాలకు అవసరం అయ్యే ఖర్చును కూడా తానే భరిస్తానని కేఎల్ రాహుల్ హామీ ఇచ్చాడు. దీంతో ఈ టీమిండియా స్టార్ బ్యాటర్‌పై సోషల్ మీడియాలో నెటిజన్స్ ప్రశంసల జల్లులు కురిపిస్తున్నారు.