బెంగుళూరు వేదికగా భారత్ శ్రీలంక మధ్య జరుగుతున్న రెండో టెస్టులో ఒక విచిత్రమై సంఘటన చోటు చేసుకుంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ ఇన్నింగ్స్ తడబడుతూ సాగుతోంది. పిక్ బాల్‌తో డే అండ్ నైట్ మ్యాచ్‌గా జరుగుతున్న ఈ టెస్టులో ఓపెనర్‌గా వచ్చిన మయాంక్ అగర్వాల్ ఒక చిన్నపాటి డ్రామా మధ్య అవుట్ అయ్యాడు. ఇన్నింగ్స్ రెండో ఓవర్ వేస్తున్న ఫర్నాండో 4వ బంతి మయాంక్ ప్యాడ్లకు తగిలి కవర్స్ వైపు వెళ్లింది. బౌలర్ ఫెర్నాండోతో పాటు శ్రీలంక ఆటగాళ్లు మయాంక్ ఎల్బీడబ్ల్యూ అవుట్ కోసం గట్టి అప్పీల్ చేశాడు. కానీ అంపైర్ అనిల్ చౌదరీ నాటౌట్‌గా ప్రకటించాడు. ఈ లోగా రన్ కోసం మయాంక్ ప్రయత్నించగా.. నాన్‌స్ట్రైకింగ్ ఎండ్‌లో ఉన్న రోహిత్ కొంచెం దూరం వచ్చి వెనక్కు వెళ్లాడు. మయాంక్ అప్పటికే సగం పిచ్ దాటేశాడు. మళ్లీ వెనక్కు తిరిగిన అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.
ఫీల్డర్ వికెట్ కీపర్‌కు బాల్ అందించడంతో రనౌట్ అయ్యాడు. నిరాశగా పెవిలియన్ బాట పట్టారు. శ్రీలంక ఆటగాళ్లు ఎల్బీ రివ్యూ కోరడంతో.. అది కాస్తా నో బాల్‌గా తేలింది. ఎల్బీ నుంచి బతికిపోయిన మయాంక్ రనౌట్ అయ్యాడు. దీంతో నిరాశగా మయాంక్ పెవిలియన్‌కు చేరాడు. కాగా బెంగుళూరు మయాంక్‌కు హోం గ్రౌండ్. కానీ కేవలం 4 పరుగులు చేసి అవుట్ అవ్వడంతో చాలా నిరాశ చెందాడు. భారత్ ఇప్పటి వరకు.. 39 ఓవర్లు ఆడి 6 వికెట్లు కోల్పోయి 151 పరుగలు చేసింది. మరి మయాంక్ అవుట్ అయిన తీరుపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: రాహుల్ సెంచరీకి మయాంక్ సూపర్ రియాక్షన్!
Mayank Agarwal runout on no ball #mayankagarwal #noball #INDvsSL #PinkBallTest #RohitSharma𓃵 pic.twitter.com/3W7cUkhrXh
— TRENDING CRIC ZONE (@rishabhgautam81) March 12, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App ని డౌన్లోడ్ చేసుకోండి.