ఐపీఎల్ 2023లో శుక్రవారం రాత్రి జరిగిన మ్యాచ్ లో ఓ ఆసక్తికర దృశ్యం కనిపించింది. సన్ రైజర్స్ యంగ్ ప్లేయర్స్ కు మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోని పాఠాలు చెబుతూ కనిపించాడు.
ఐపీఎల్ 2023 సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ నాలుగో విజయాన్ని నమోదు చేస్తే.. సన్ రైజర్స్ హైదరాబాద్ నాలుగో ఓటమిని మూటగట్టుకుంది. శుక్రవారం చెపాక్ స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో 7 వికెట్ల తేడాతో SRH ను ఓడించింది.దాంతో హోం గ్రౌండ్ లో తమను ఓడించడం అంత ఈజీకాదని మరోసారి రుజువు చేసింది చెన్నై జట్టు. ఇక మ్యాచ్ ముగిసిన అనంతరం గ్రౌండ్ లో ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. అదేంటంటే? ప్రత్యర్థి జట్టు అయిన సన్ రైజర్స్ ఆటగాళ్లకు ధోని పాఠాలు చెప్పాడు. తన విలువైన సూచనలను, సలహాలను వారికి అందించాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి.
మహేంద్ర సింగ్ ధోని.. వరల్డ్ బెస్ట్ ఫినిషర్ గా తనకంటూ ఓ బ్రాండ్ ను ప్రపంచ క్రికెట్ లో లిఖించుకున్నాడు. అంతకి మించి బెస్ట్ కెప్టెన్ వరల్డ్ క్రికెట్ పై తన ముద్రను వేసుకున్నాడు. ఓడిపోయే మ్యాచ్ లను సైతం ప్రత్యర్థి నుంచి లాక్కొవడంలో దిట్ట ధోని. అతడి విలువైన సూచనలు, సలహాలు తీసుకోవాలని ఎంతో మంది యంగ్ ప్లేయర్స్ ఆరాడటపడుతుంటారు. ధోని సైతం అలాంటి వారికి తన సలహాలు, సూచనలు ఇస్తూనే ఉంటాడు. తాజాగా శుక్రవారం సన్ రైజర్స్ తో జరిగిన మ్యాచ్ లో కూడా ప్రత్యర్థి ఆటగాళ్లకు తన క్రికెట్ జీవితంలో నిక్షిప్తమై ఉన్న విలువైన సూచనలను, అనుభవాలను వారికి వివరించాడు.
ఈ మ్యాచ్ ముగిసిన అనంతరం ధోని SRH యంగ్ ప్లేయర్స్ ను కలిశాడు. వారిలో ఉమ్రాన్ మాలిక్, వాషింగ్టన్ సుందర్, అభిషేక్ శర్మ, మయాంక్ అగర్వాల్, డాగర్ సహా మరికొంత ప్లేయర్స్ ఉన్నారు. ఈ మ్యాచ్ లో వారిలో ఉన్న లోపాలను ఎలా సరిచేసుకోవాలో వారికి సూచించినట్లు తెలస్తోంది. ఇక ధోని ఇచ్చే సలహాలను, సూచనలను యంగ్ ప్లేయర్స్ శ్రద్దగా విన్నారు. ఇక గేమ్ ఆడుతున్నంత సేపే ఆటగాళ్లను ప్రత్యర్థిగా చూస్తాడు ధోని. మ్యాచ్ ముగిశాక ఎక్కువ టైమ్ ను ప్రత్యర్థి టీమ్ తో గడుపుతాడు. తన క్రికెట్ కెరీర్ లో ఒడిదుడుకులను,ఒత్తిడిని ఎలా జయించాలో యంగ్ ప్లేయర్స్ కు వివరిస్తూ.. వారిలో ఆత్మవిశ్వాశాన్ని నింపుతుంటాడు మిస్టర్ కూల్.
ఇక గతంలోనూ ధోని ఇలా ప్రత్యర్థి జట్ల ప్లేయర్స్ కు పాఠాలు చెప్పడం మనం చూశాం. ప్రస్తుతం ధోని సన్ రైజర్స్ ఆటగాళ్లకు పాఠాలు చెబుతున్న ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే 6 మ్యాచ్ ల్లో కేవలం రెండే మ్యాచ్ లు గెలిచిన హైదరాబాద్ టీమ్ కు ఇది హ్యాట్రిక్ ఓటమి. జట్టులో అద్భతమైన ప్లేయర్స్ ఉన్నప్పటికీ విజయాలు మాత్రం దక్కడం లేదు. హ్యారీ బ్రూక్,అగర్వాల్, మార్క్ రమ్, ఉమ్రాన్ మాలిక్, భువనేశ్వర్ కుమార్ లాంటి మేటి ప్లేయర్స్ ఉన్నా ఫలితం శూన్యం. మరి ధోని సలహాలతోనైన సన్ రైజర్స్ జట్టు పరిస్థితి మారుతుందా? ఆటగాళ్లలో ఇప్పటికైనా మార్పు వస్తుందా? అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
Video Of The IPL 2023#dhoni #MSDhoni pic.twitter.com/qCLDYzhYdg
— Aditya Ojha (@AdityaOjha2002) April 21, 2023