2023 ఐపీఎల్ 16వ సీజన్ కు సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ కు విలన్ గా మారాడు స్టార్ బ్యాటర్ మయాంక్ అగర్వాల్. వరుసగా విఫలం అవుతూ.. జట్టుకు భారంగా మారాడు.
సాధారణంగా ఏ వ్యక్తి అయినా, ఏ సంస్థ అయినా ఆఖరికి ఏ జట్టు అయినా ఓటముల నుంచి పాఠాలు నేర్చుకున్నప్పుడే దానికి మనుగడ ఉంటుంది. లేదంటే ఆ జట్టుకు, ఆ సంస్థకు తిప్పలు తప్పవు. ప్రస్తుతం ఐపీఎల్ 2023 సీజన్ లో ఇలాంటి తిప్పలే పడుతోంది సన్ రైజర్స్ హైదరాబాదు. వరుస ఓటములు ఎదురౌతూ ఉన్నా గానీ, వాటి నుంచి పాఠాలను మాత్రం నేర్చుకోలేకపోతోంది. ఇక SRH జట్టుకు ప్రధాన విలన్ గా మారాడు స్టార్ బ్యాటర్ మయాంక్ అగర్వాల్. ఓపెనర్ గా రాణించడం లేదని చెన్నై మ్యాచ్ లో ఫినిషర్ గా 5వ స్థానంలో బరిలోకి దిగాడు. కానీ సారి కూడా అదే పూర్ ఫామ్ ను కొనసాగించి దారుణంగా విఫలం అయ్యాడు. సన్ రైజర్స్ ఓటములకు తనవంతు పాత్రను నిర్వర్తిస్తూ వస్తున్నాడు మయాంక్ అగర్వాల్.
మయాంక్ అగర్వాల్.. ఐపీఎల్ చరిత్రలో స్టార్ ఆటగాడిగా కొనసాగాడు. ఎన్నో అద్భతమైన ఇన్నింగ్స్ లతో ప్రాతినిధ్యం వహించిన జట్లకు ఒంటి చేత్తో విజయాలను అందించాడు. అయితే ఇదంత ఒకప్పటి మాట. గత కొంత కాలంగా అతడు ఫామ్ లో లేక ఇబ్బంది పడుతూనే ఉన్నాడు. అయినప్పటికీ కావ్యా పాప మాత్రం అతడిని రూ. 8.5 కోట్లకు కొనుగోలు చేసింది. ఇంత భారీ ధర చెల్లించినప్పటికీ అతడు మాత్రం ఆ డబ్బుకు న్యాయం చేయలేకపోతున్నాడు. ఇక 2022 ఐపీఎల్ సీజన్ లో పంజాబ్ జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించాడు మయాంక్. అప్పటి నుంచి అతడి ఆటతీరులో మార్పు మెుదలైంది.
ఈ క్రమంలోనే అక్కడి నుంచే మయాంక్ అగర్వాల్ కు శని పట్టుకుంది. కెప్టెన్ కాక ముందు భారీగా పరుగులు చేసిన అతడు.. తర్వాత పూర్ ఫామ్ ను కొనసాగిస్తున్నాడు. ఇక SRH టీమ్ లోకి వచ్చాక మరీ దారుణంగా విఫలం అవుతూ వస్తున్నాడు. ఇప్పటి వరకు ఆడిన 6 మ్యాచ్ లో కేవలం 115 పరుగులు మాత్రమే చేశాడు. ఈ సీజన్ లో అతడి అత్యధిక స్కోర్ 48 పరుగులు అంటేనే అతడి బ్యాటింగ్ ఏ స్థాయిలో ఉందో అర్ధం అవుతూనే ఉంది. ఓపెనర్ గా వస్తే విఫలం అవుతున్నాడని ఫినిషర్ గా 5వ స్థానంలో తాజా మ్యాచ్ లో పంపితే.. రెండు పరుగులకే వెనుదిరిగాడు మయాంక్. ఒకప్పుడు మయాంక్ ఉన్నాడు అంటే జట్టు గెలుస్తుంది అన్న అభిప్రాయం ఉండేది. కానీ ఇప్పుడు ఆ ఉద్దేశం లేదు.
ఇక మయాంక్ పూర్ ఫామ్ చూసి.. ఏ నమ్మకంతో కావ్యా పాప అన్ని కోట్లు ఇతడిపై పెట్టింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. ఇక మయాంక్ ప్రస్తుత ఫామ్ పై క్రికెట్ అభిమానులు తెగ ట్రోల్స్, మీమ్స్ చేస్తున్నారు. ప్రస్తుతం సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు 6 మ్యాచ్ లు ఆడి కేవలం రెండు విజయాలు, నాలుగు అపజయాలతో అట్టడుగు నుంచి రెండో స్థానంలో ఉంది. ఇక రాబోయే మ్యాచ్ ల్లో నైనా మయాంక్ జట్టును గెలిపిస్తాడో లేదో వేచి చూడాలి. మయాంక్ స్థానంలో ఆఖర్లో బ్యాటింగ్ కు వస్తున్న అబ్దుల్ సమద్ ను ఆడించాలని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. మరి తన దారుణమైన ఆటతో సొంత జట్టుకే విలన్ గా మారిన మయాంక్ అగర్వాల్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Speeds in #Chennai today:
Duronto Express ⚡
Jaddu’s sword⚡⚡
Dhoni’s gloves ⚡⚡⚡#CSKvSRH #IPLonJioCinema #TATAIPL #IPL2023 | @msdhoni pic.twitter.com/p7qtuEe9AI— JioCinema (@JioCinema) April 21, 2023
Ayindhi edho ayindhi oka vandha unchukoni migatha auction dabbulu icheyi @mayankcricket pic.twitter.com/Ve1EsOLfoL
— వేటగాడు (@rao_4005) April 21, 2023
Every one down contender of Indian team is in academy these days… Tripathi and Hooda❤️🔥
Whereas Mayank Agarwal today came as finisher, finished his innings with 2 runs off 4 balls, consistency at its peak😍🔥 #CSKvSRH
— TukTuk Academy (@TukTuk_Academy) April 21, 2023