తాజాగా ఇండోర్ వేదికగా ఇండియా-ఆసిస్ మధ్య మూడో టెస్ట్ మ్యాచ్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఇక ఈ మ్యాచ్ లో రెండు రోజులు ఆట ముగిసే సరికి 30 వికెట్లు నేల కూలయి. దాంతో ఈ పిచ్ పై విమర్శలు గుప్పించాడు ఆసిస్ దిగ్గజ బ్యాటర్. ఇలాంటి పిచ్ ల వల్లే టెస్ట్ క్రికెట్ మరణిస్తుందని పేర్కొన్నాడు.
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఇండోర్ లో జరుగుతున్న మూడో టెస్టులో భారత్ తొలి ఇన్నింగ్స్ లో 109 పరుగులకే కుప్పకూలిన సంగతి తెలిసిందే. అయితే ఈ పిచ్ పై తొలి రోజు స్పిన్నర్లు చెలరేగి ఏకంగా 14 వికెట్లు తీయడంతో.. ఈ టెస్టు కూడా మూడు రోజుల్లో ముగియడం ఖాయంగా కనిపిస్తుంది. అంతే కాదు వచ్చిన ఈ వికెట్లన్నీ ఒక్క రన్ ఔట్ మినహా అన్నికూడా స్పిన్నర్లకే దక్కడం గమనార్హం. దీంతో ఈ పిచ్ తొలి రోజు నుంచే ఎంత టర్న్ అయిందో మనం గ్రహించవచ్చు. ఈ నేపథ్యంలో ఈ టెస్ట్ మ్యాచ్ కి కామెంటేటర్ గా వ్యవహరిస్తున్న ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ “మాథ్యూ హెడెన్” పిచ్ ని ఉద్దేశించి తన అసంతృప్తిని వ్యక్తం చేసాడు.
సాధారణంగా ఉపఖండపు పిచ్ లంటే స్పిన్ కి అనుకూలిస్తాయి అన్న వాదన ఉంది. అయితే ఒకప్పుడు ఉపఖండపు పిచ్ ల మీద ఆడాలంటే కొంచెం సవాళ్లతో కూడుకున్నది. ఎందుకంటే అప్పట్లో తొలి రెండు రోజులు పిచ్ బ్యాటింగ్ కి అనుకూలిస్తే.. ఆ తర్వాత మూడు రోజులు స్పిన్నర్లు తిప్పేసేవాళ్ళు. దీంతో మ్యాచ్ 5 రోజులు లేదా కనీసం 4రోజులు అయినా జరిగేది . కానీ ఇప్పుడు పరిస్థితులు మాత్రం దానికి పూర్తి భిన్నంగా మారాయి. ఫారెన్ దేశాలు స్పిన్ ఆడడంలో ఉన్న బలహీనతను ఆసరాగా తీసుకొని తొలి రోజు నుండే టర్నింగ్ ట్రాక్స్ తయారు చేస్తున్నారు. దీంతో తొలిరోజు నుండే స్పిన్ ఎదుర్కోలేక బ్యాట్స్ మెన్ చతికిలపడుతున్నారు.
ఈ నేపథ్యంలో బ్యాట్స్ మెన్ లను విమర్శించడం మానేసి పిచ్ మీద పడి ఏడుస్తున్నారు కొంతమంది మాజీలు. ఈ మ్యాచ్ లో తొలి రోజు 6వ ఓవర్లలోనే స్పిన్నర్ కుహ్నేమన్ రోహిత్ శర్మ వికెట్ సంపాదించాడు. అయితే కుహ్నేమన్ బంతి బాగా టర్న్ అవడంతో భారత కెప్టెన్ రోహిత్ శర్మ స్టంపౌట్ గా వెనుదిరగాల్సి వచ్చింది. దీనితో ఆశ్చర్యానికి గురైన హెడెన్.. సహచర కామెంటేటర్ రవి శాస్త్రితో తన అసహనాన్ని వ్యక్తం చేసాడు.
ఇక ఈ పిచ్ పై మథ్యూ హెడెన్ మాట్లాడుతూ.. “ఇదేం పిచ్ ఇలా ఉంది. ఇంతలా టర్న్ అవడం నేనెప్పుడూ చూడలేదు. ఈ పిచ్ జెనరేట్ చేసే టర్న్ చూస్తే భయం వేస్తుంది. ఒక స్పిన్నర్ 6 వ ఓవర్లోనే బంతిని గింగరాలు తిప్పుతుంటే ఈ మ్యాచ్ కూడా మరో రెండు, మూడు రోజుల్లో ముగిసేలా కనిపిస్తుంది. ఇలాంటి పిచ్ కి ఎప్పుడు కూడా నా మద్దతు ఉండదు. తొలి రెండు రోజులు పిచ్ బ్యాటింగ్ కి అనుకూలంగా ఉండాలి”. అని ఆగ్రహం వ్యక్తం చేసాడు. దీనికి రవి శాస్త్రి చాలా సింపుల్ గా హోమ్ కండీషన్స్ అని చెప్పుకొచ్చాడు. ఇలా అయితే టెస్ట్ క్రికెట్ ఎక్కువ రోజలు బతకదని, టెస్ట్ క్రికెట్ నాశనం కావడానికి ఇలాంటి పిచ్ లే కారణమని హెడెన్ చెప్పుకొచ్చాడు. మరి పిచ్ ఇంత టర్న్ అవుతున్న నేపథ్యంలో హెడెన్ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.