సాధారణంగా క్రికెట్ లో ఇతర ఆటగాళ్ల ఆటతీరుపై విదేశీ ప్లేయర్స్ కామెంట్స్ చేయడం మనం వింటూనే ఉంటాం. కొంత మంది విమర్శలు చేస్తే.. మరికొంతమంది ప్రశంసలు కురిపిస్తారు. గత కొంత కాలంగా టీమిండియా ప్లేయర్స్ పై విదేశీ దిగ్గజ, ప్రస్తుత క్రికెటర్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్న సంగతి మనకు తెలిసిందే. తాజాగా దక్షణాఫ్రికా మాజీ స్టార్ క్రికెటర్ టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మపై ప్రశంసల వర్షం కురిపించాడు. అతడితో కలిసి పనిచేయాలని ఉన్నట్లు పేర్కొన్నాడు. ఇక వరల్డ్ క్రికెట్ లో రోహిత్ సారథ్యం వహిస్తున్న ముంబై ఇండియన్స్ ఫ్రాంఛైజీ నెంబర్ వన్ అని చెప్పుకొచ్చాడు.
రోహిత్ శర్మ.. టీమిండియా హిట్ మ్యాన్ గా వరల్డ్ వైడ్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. బంగ్లాదేశ్ తో జరిగిన వన్డే సిరీస్ లో భాగంగా రెండో వన్డేలో గాయపడ్డ రోహిత్.. ప్రస్తుతం జరుగుతున్న టెస్ట్ సిరీస్ కు దూరం అయ్యాడు. ఇక గాయపడ్డ మ్యాచ్ లో వీరోచిత ఇన్నింగ్స్ ఆడి ప్రపంచ వ్యాప్తంగా మన్ననలు పొందాడు హిట్ మ్యాన్. ఈ మ్యాచ్ ఓ వైపు ఎముక పక్కకు తొలగి బాధిస్తున్నా గానీ అద్భుతమైన పోరాటం చేశాడు. అందుకే రోహిత్ అంటే అభిమానులకు అంత ప్రేమ. ఇక ఈ క్రమంలోనే రోహిత్ శర్మపై ప్రశంసల వర్షం కురిపించాడు సౌతాఫ్రికా మాజీ స్టార్ క్రికెటర్ మార్క్ బౌచర్.
Mark Boucher said “Rohit Sharma is a fantastic player & leader, looking forward to working with him”.
— Johns. (@CricCrazyJohns) December 22, 2022
రోహిత్ తో పాటు ఐపీఎల్ లో అతడు ప్రాతినిథ్యం వహిస్తున్న ముంబై ఇండియన్స్ ఫ్రాంఛైజీని కూడా పొగడ్తలతో ముంచెత్తాడు. వరల్డ్ క్రికెట్ స్పోర్ట్స్ లో ముంబై ఇండియన్స్ ఫ్రాంఛైజీ గొప్పదని కితాబిచ్చాడు బౌచర్. ఇక దానికి సారథిగా ఉన్న రోహిత్ శర్మతో కలిసి పనిచేయాలని ఉన్నట్లు మార్క్ బౌచర్ చెప్పుకొచ్చాడు. రోహిత్ గొప్ప కెప్టెన్ అని, అంతకంటే గోప్ప ప్లేయర్ అని అతడితో కలిసి ఆటను పంచుకునేందుకు వేచిచూస్తున్నట్లు బౌచర్ పేర్కొన్నాడు. ఇక ప్రస్తుతం బౌచర్ దక్షిణాఫ్రికా జట్టుకు కోచ్ గా ఉన్న సంగతి విదితమే. రోహిత్ శర్మ బంగ్లాతో జరుగుతున్న రెండో టెస్ట్ లో అందుబాటులోకి వస్తాడు అని వార్తలు వచ్చినప్పటికీ.. గాయం నుంచి పూర్తిగా కోలుకోక పోవడంతో అతడు ఈ మ్యాచ్ కు అందుబాటులోకి రాలేదు.
Mark Boucher said “Mumbai Indians is one of the best franchises in world sport”.
— Johns. (@CricCrazyJohns) December 22, 2022