క్రికెట్ గాడ్ సచిన్ రికార్డులు బద్దలు కొట్టాలంటే ప్రస్తుతం టీమ్ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకే సాధ్యం. అందుకే అందరూ కూడా కోహ్లీని సచిన్ తో పోల్చి చూస్తారు. కానీ కింగ్ మాత్రం సచిన్ తో నాకు పోలికా ? అతడు నా గురువు మాత్రమే అని చెప్పుకొచ్చాడు.
భారత క్రికెట్లో సచిన్ టెండూల్కర్ స్థానం ప్రత్యేకం. 24 సంవత్సరాలుగా సచిన్ దేశానికి చేసిన సేవ మరువలేనిది. ముఖ్యంగా 1990ల్లో టీమ్ ఇండియా కి ఒంటి చేత్తో విజయాలనందించాడు. భారత జట్టు పతన స్థాయికి చేరుకుంటున్న దశలో జట్టుని తన భుజాలపై మోశాడు. ఒక దశలో ఇండియన్ క్రికెట్ అంటే సచిన్. సచిన్ అంటే ఇండియన్ క్రికెట్ అనేలా మారిపోయింది. ఎన్నో రికార్డులు , మరెన్నో రివార్డులు సచిన్ చెంత చేరాయి. దేశంలో ఇచ్చే అత్యున్నత పురస్కారం భారత రత్న సైతం సచిన్ ని వరించింది. తన బ్యాటింగ్ తో యావత్ దేశాన్ని స్థంబించిపోయేలా చేసి “క్రికెట్ గాడ్” గా పేరు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం టీమ్ ఇండియాలో సచిన్ రికార్డులని బద్దలు కొట్టే సత్తా ఒక్క విరాట్ కోహ్లీకే ఉంది. దీనితో విరాట్ ని సచిన్ తో పోలుస్తుంటారు క్రికెట్ ప్రేమికులు. అయితే ఇలాంటి మాటలు క్రికెట్ నాలెడ్జ్ లేని వారే మాట్లాడతారని కోహ్లీ చెప్పుకొచ్చాడు.
సచిన్ తర్వాత అంతటి కీర్తిని సంపాదించుకున్న బ్యాటర్ ఎవరైనా ఉన్నారంటే అది ఒక్క విరాట్ కోహ్లీనే. ఈ విషయం ఎవరిని అడిగిన చెబుతారు. పరుగుల,సెంచరీల, రికార్డులు ఇలా వేటి పరంగా చూసుకున్నా సచిన్ తర్వాత కోహ్లీనే ఉంటాడు. భవిష్యత్తులో సచిన్ రికార్డులు బ్రేక్ చేయాలన్నా.. విరాట్ వలనే సాధ్యం అవుతుంది. దీంతో విరాట్ సచిన్ వారసుడని, సచిన్ రికార్డులు బద్దలు కొడతాడని అభిమానులు క్రికెట్ విశ్లేకాలు అంచనా వేస్తూ సచిన్ తో పోలుస్తూ ఉంటారు. అయితే సచిన్ రికార్డులకి దగ్గరగా ఉన్నా.. కోహ్లీ మాత్రం తనని సచిన్ తో పోల్చడం మూర్ఖత్వంగా పేర్కొన్నాడు. ఇటీవలే రాబిన్ ఉతప్పకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన కోహ్లీ ఈ విషయం గురించి విశ్లేషించాడు.
కోహ్లీ మాట్లాడుతూ.. “నన్ను సచిన్ తో పోలిస్తే నాకు నవ్వొస్తుంది. క్రికెట్ నాలెడ్జ్ లేని వారే ఇలా మాట్లాడతారు. సచిన్ అంటే కేవలం రికార్డులు, రివార్డులు మాత్రమే కాదు. అతని ద్వారా స్ఫూర్తి పొంది క్రికెట్ లోకి వచ్చిన వారు ఎంతో మంది ఉన్నారు. క్రికెట్ కి ఇంత గుర్తింపు రావడానికి ఆయనే కారణం. చిన్నప్పుడు నేను క్రికెట్లోకి రావడానికి కూడా ఆయనే ఇన్స్పిరేషన్. సచిన్ గురించి తెలిసిన వారెవరైనా ఆయన్ని ఒక గురువుగా భావిస్తారు. ఎందుకంటే సచిన్ అంటే కేవలం పేరే కాదు. అతనొక ఎమోషన్. అతను గ్రీజ్ లో ఉంటే భారత్ గెలిచేదని నమ్మేవారు. సచిన్ ఒక శకాన్ని నిర్మించి శాసించాడు”. అని ఈ సందర్భంగా సచిన్ మీద తన గౌరవాన్ని తెలియజేశాడు. మరి కోహ్లీ భవిష్యత్తులో సచిన్ రికార్డులు బద్దలు కొట్టే అవకాశమున్నా..సచిన్ తనకు గురువు అని గొప్ప మనసు చాటుకున్నాడు. కోహ్లీ చేసిన వ్యాఖ్యలు మీకేవిధంగా అనిపించాయో కామెంట్ల రూపంలో తెలపండి.