‘ఇండియా టూర్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా’లో భారత అభిమానులకు నిరాశ కొనసాగుతూనే ఉంది. వన్డేల్లోనైనా సత్తాచాటుతారని ఎదురుచూసిన అభిమానులకు నిరుత్సాహం తప్పలేదు. అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్ లో టీమిండియా విఫలమైంది. అద్భుతమైన స్టార్ అందించిన బౌలర్లు మిడిల్ ఓవర్స్ లో నిరుత్సాహ పరిచారు. ఓటమి అంచుల నుంచి తిరిగి పుజుకుని సౌత్ ఆఫ్రికా జట్టు 31 పరుగుల తేడాతో విజయం సాధించింది.
జట్టు కెప్టెన్ గా ఉన్నప్పుడు.. విజయానికి క్రెడిట్ నే కాదు.. ఓటమికి బాధ్యత కూడా తీసుకోక తప్పదు. ఇప్పుడు ఓటమి తర్వాత అందరూ కేఎల్ రాహుల్ నే టార్గెట్ చేస్తున్నారు. కొందరైతే.. ఐపీఎల్ కెప్టెన్సీ నుంచి చిట్టాలు విప్పుతున్నారు. అటు టెస్టు, ఇటు వన్డే రెండు మ్యాచ్ లలో కెప్టెన్ గా కేఎల్ రాహుల్ ప్రభావం ఏమాత్రం కనిపించలేదని విమర్శిస్తున్నారు. పగ్గాలు అందుకున్న వెంటనే అద్భుతాలు చేయాలని ఆశిస్తున్నారు.
Hard luck Captain 😞💔@klrahul11 • #CaptainKL pic.twitter.com/XIV2lhGlYg
— Juman (@cool_rahulfan) January 19, 2022
మరోవైపు రాహుల్ నిర్ణయాలను తప్పుబడుతున్నారు. అతనికి ఇంకా చాలా అనుభవం కావాలంటూ కామెంట్ చేస్తున్నారు. బౌలర్ సెలక్షన్ విషయంలో రాహుల్ నిర్ణయాలను ఎత్తి చూపుతున్నారు. పార్టనర్ షిప్ బిల్డ్ అవుతుంటే.. రెగ్యులర్ బౌలర్ ప్రభావం లేనప్పుడు ఆల్టర్ నేట్ బౌలర్ ను తీసుకోక పోవడాన్ని విమర్శిస్తున్నారు. వెంకటేశ్ అయ్యర్ ఆప్షనల్ బౌలర్ గా ఉన్నప్పుడు ఎందుకు అతడిని ఉపయోగించుకోలేదని ప్రశ్నిస్తున్నారు. అలాంటి చిన్న చిన్న నిర్ణయాలు తీసుకోలేకపోవడం వల్లే మ్యాచ్ ఓడిపోయామంటున్నారు. అయితే, ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే.. ఒక సీనియర్ కెప్టెన్ ను విమర్శించినట్లు రాహుల్ పై ఆగ్రహం వ్యక్తం చేయటం ఎంత వరకు కరెక్ట్? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.