క్రిస్టియానో రొనాల్డో ఫుట్ బాల్ ప్రేమికులకు పరిచయం అక్కర్లేనిపేరు. మూడు పదుల వయసులోనూ తనలో ఏ మాత్రం దూకుడు తగ్గలేదంటూ యువ ఆటగాళ్లతో పోటీ పడి మరీ సాకర్ గేమ్ లో దూసుకెళ్తున్నాడు. సాకర్ గేమ్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రోనాల్డో వ్యక్తిత్వానికి మాయని మచ్చలా ఉన్నా అత్యాచారం కేసుపై అమెరికా కోర్టు తాజాగా తీర్పును వెలువరించింది.
2009లో లాస్ వెగాస్ లోని ఒక హోటల్ లో రోనాల్డో తనపై అత్యాచారం చేసినట్లు కేత్రిన్ మోయెర్గా అనే మహిళ కోర్టులో కేసు వేసింది. దీనిపై గత కొన్నేళ్లుగా సుదీర్ఘ విచారణ జరిపిన లాస్ వెగాస్ కోర్టు తాజాగా తీర్పునిచ్చింది. బాధితరాలు తరుఫున వాదనలు వినిపించిన లాయర్ సరైన ఆధారాలను కోర్టుకు సమర్పించలేకపోయాడని తన తీర్పులో పేర్కొంది. అదే క్రమంలో ఈ కేసును ఇంకా కొనసాగించలేమని.. కొట్టివేస్తున్నట్లుగా ప్రకటించింది.
Kathryn Mayorga has lost the case against Cristiano Ronaldo.
Justice prevails. pic.twitter.com/LFiCzcbuDP
— TCR. (@TeamCRonaldo) June 11, 2022
ఇక క్రిస్టియానో రొనాల్డోకు ఈ ఏడాది ఖతర్ వేదికగా జరగబోయే ఫుట్ బాల్ ప్రపంచకప్ ఆఖరిదిగా మారే అవకాశం ఉంది. దాంతో ఈ ప్రపంచకప్ లో మెరుగైన ప్రదర్శన చేయాలని రొనాల్డో పట్టుదలగా ఉన్నాడు. పోర్చుగల జట్టుకు ప్రపంచకప్ టైటిల్ గెలిచే అవకాశం లేకపోయినా కనీసం సెమీఫైనల్ చేరేందుకు అవకాశం ఉంది. ఇప్పటివరకు తన కెరీర్ లో 1131 మ్యాచులాడిన రొనాల్డో.. 801 గోల్స్ తో ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచాడు. ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: Umran Malik: అట్లుంటది మనతో.. SRH బౌలర్ ఇక్కడ