ఇంగ్లాండ్ టూర్ ఆఫ్ నెదర్లాండ్స్ 2022లో భాగంగా ఇరు జట్లు మూడు వన్డేల్లో తలపడనున్నారు. తొలి వన్డేలో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న నెదర్లాండ్స్ జట్టు ఇంగ్లాండ్ బ్యాటర్లను అదుపుచేయలేక నానా ఇక్కట్లు పడింది. క్రీజులో ఉన్న బట్లర్- మలాన్ విజృంభిస్తున్నారు. బట్లర్ నెదర్లాండ్స్ బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నాడు. జోస్ బట్లర్ కు బాల్ వేయాలంటేనే భయపడేలా చేశాడు. వన్డేల్లో ఇంగ్లాండ్ తరఫున రెండో అత్యంత వేగవంతమైన సెంచరీ నమోదు చేశాడు. జోస్ బట్లర్ కేవలం 47 బంతుల్లోనే శతకం పూర్తి చేశాడు. ఈ వన్డేలో అర్ధశతకం, శతకం రెండూ సిక్సర్ తోనే పూర్తి చేయడం విశేషం. ఇంగ్లాండ్ తరఫున మొదటి ఫాస్టెస్ట్ సెంచరీ కూడా బట్లర్(46 బంతుల్లో) పేరిటే ఉంది.
జేసన్ రాయ్ 1(7) నిరాశ పరచగా.. జోస్ బట్లర్ చెలరేగి ఆడుతున్నాడు.. మరోవైపు డేవిడ్ మలాన్ కూడా 109 బంతుల్లో 125 పరుగులు చేశాడు. ఇంగ్లాండ్ బ్యాటర్ల దాటికి నెదర్లాండ్స్ బౌలర్లు బిక్కమొఖాలు వేశారు. 45 ఓవర్లకే 400 పరుగులు చేసిన ఇంగ్లాండ్ మరింత విధ్వంసకరంగా ఆడుతోంది. 45 ఓవర్లు పూర్తయ్యేసరికి 4 వికెట్ల నష్టానికి 414 పరుగులు చేసింది. జోస్ బట్లర్ విధ్వంసకర ఇన్నింగ్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
This is Jos Buttler’s world. pic.twitter.com/8WfI3RpzkZ
— Johns. (@CricCrazyJohns) June 17, 2022
Jos Buttler hits his 10th ODI hundred and it came in just 47 balls. 2nd fastest hundred by an Englishman, what a knock by Buttler. Terrific by Jos The Boss. pic.twitter.com/tJhi7GUo9o
— Mufaddal Vohra (@mufaddal_vohra) June 17, 2022