జోస్ బట్లర్.. ఈ పేరు వినగానే విధ్వంసకర టీ20 బ్యాట్స్‌మెన్ గుర్తుకు వస్తాడు. కానీ తన శైలికి పూర్తి భిన్నంగా అసలు సిసలు టెస్ట్ క్రికెటర్‌గా పరిణతి చెందిన ఆటతీరును కనబర్చాడు బట్లర్. ఆస్ట్రేలియాతో జరుగుతున్న యాషెస్ సిరీస్‌లోని రెండో టెస్ట్‌లో ఇంగ్లండ్ ఓడిపోయింది. కానీ ఇంగ్లండ్ వికెట్ కీపర్ జోస్ బట్లర్ కనబర్చిన పోరాట పటిమ మాత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంటుంది. తన జట్టును ఓటమి నుంచి రక్షించాలని బట్లర్ చేసిన పోరాటం క్రికెట్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటుంది.
అతను చేసింది 26 పరుగులే అయినా.. చాలా సేపు క్రీజ్‌లో నిల్చుని, భీకరమైన ఆస్ట్రేలియా బౌలింగ్‌ను తన డిఫెన్స్‌తో ముప్పుతిప్పలు పెట్టి.. వారి విజయాన్ని చాలా ఆలస్యం చేశాడు. కొన్ని గంటల పాటు క్రీజ్‌లో పాతుకుపోయిన బట్లర్ 207 బంతులను ఎదుర్కొని కేవలం రెండు బౌండరీల సాయంతో 26 పరుగులు చేశాడు. బట్లర్ చేసిన పరుగులు ఇక్కడ కొలమానం కాదు. కానీ.. డ్రా కోసం అతను చేసిన పోరాటం గురించి క్రికెట్ ప్రపంచం మొత్తం మాట్లాడుతుంది. బట్లర్‌కు మరో ఆటగాడి మద్దతు దొరికి ఉంటే.. కచ్చితంగా ఇంగ్లండ్ రెండో టెస్ట్‌ను డ్రా చేసుకునేదని క్రికెట్ నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.. కానీ మిగిలిన ఆటగాళ్లు ఎవ్వరూ కూడా క్రీజ్‌లో నిలబడలేకపోయారు. బట్లర్ ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు.
ఇదీ చదవండి: ఐపీఎల్ 2022 అన్ని ఫ్రాంచైజీల రిటెన్షన్ లిస్ట్..ఆస్ట్రేలియా బౌలర్ల భీకరమైన బౌన్సర్లను, వేగాన్ని తట్టుకుంటూ దాదాపు చివరకంటా నిలబడ్డాడు. కానీ ఓటమి మాత్రం తప్పలేదు. రిచర్డ్ సన్ బౌలింగ్‌లో బట్లర్ హిట్ వికెట్‌గా అవుట్ అయి పెవిలియన్ చేరాడు. ఇతర బ్యాటర్ల సహకారం లభించక ఇంగ్లండ్ ఓడిపోయింది. ఆస్ట్రేలియా మొదటి ఇన్సింగ్స్‌లో 9 వికెట్లు కోల్పోయి 473 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. ఇంగ్లండ్ మొదటి ఇన్నింగ్స్‌లో 236 పరుగులకు కుప్పకూలింది. భారీ ఆధిక్యంతో రెండో ఇన్సింగ్స్ ఆరంభించిన ఆస్ట్రేలియా 230 పరుగులకు 9 వికెట్లు కోల్పోయి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసి ఇంగ్లండ్‌కు భారీ టార్గెట్‌ను సెట్ చేసింది.
ఇదీ చదవండి: తగలరాని చోట గట్టిగా తగిలిన బంతి! విలవిల్లాడిన ఇంగ్లండ్ కెప్టెన్ రూట్
ఓటమి తప్పని మ్యాచ్‌లో బట్లర్ మినహా మిగత బ్యాటర్లు చేతులు ఎత్తేశారు. దీంతో ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో 192 పరుగులకే ఆలౌట్ అయి మ్యాచ్‌ను చేజార్చుకుంది. దీంతో ఆస్ట్రేలియా ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 2-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. మరి ఈ మ్యాచ్‌లో తన డిఫెన్స్‌తో ఆస్ట్రేలియా బౌలర్లకు చుక్కలు చూపించిన బట్లర్ ఇన్నింగ్స్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
What a way to end an epic innings! 😲
That’s the first time Buttler has been dismissed hit wicket in his 193-innings first class career #Ashes pic.twitter.com/nRP09djjay
— cricket.com.au (@cricketcomau) December 20, 2021
ఇదీ చదవండి: టీమిండియా ప్రాక్టీస్ సెషన్ లో గొడవ! ద్రావిడ్ ముందే రచ్చ!
What a way to end an epic innings! 😲
That’s the first time Buttler has been dismissed hit wicket in his 193-innings first class career #Ashes pic.twitter.com/nRP09djjay
— cricket.com.au (@cricketcomau) December 20, 2021