టీ20ల్లో రికార్డులే కాదు అత్యంత చెత్త గణాంకాలు కూడా నమోదవుతుంటాయి. ఇప్పుడు అలాంటిదే ఓ మ్యాచ్ సందర్భంగా జరిగింది. ఇంతకీ అవేంటో తెలుసా?
క్రికెట్ పేరు చెప్పగానే అందరికీ సిక్సులు, ఫోర్లు, అరుదైన రికార్డులే గుర్తొస్తాయి. ఒకప్పుడు టెస్టులు, వన్డేలతో సాఫీగా ఉన్న ఈ గేమ్ కాస్త.. టీ20ల రాకతో ఫాస్ట్ అయిపోయింది. టీ20లనే కాదు వన్డే, టెస్టులను కూడా చాలా త్వరగా ముగించేస్తున్నారు. రీసెంట్ గా ఆస్ట్రేలియా రెండు టెస్టులను టీమిండియా మూడు రోజుల్లోనే పూర్తి చేసింది. అయితే ఇప్పుడు చెప్పబోయే విషయం మాత్రం చాలా అంటే చాలా షాకింగ్ గా ఉంటుంది. ఎందుకంటే ఓ టీ20 మ్యాచులో 10 పరుగులకే జట్టు ఆలౌట్ కాగా, ప్రత్యర్థి జట్టు రెండు బంతుల్లోనే టార్గెట్ కంప్లీట్ చేయడం విశేషం.
ఇక వివరాల్లోకి వెళ్తే.. స్పెయిన్-ఐసిల్ ఆఫ్ మ్యాన్ జట్ల మధ్య ఆదివారం టీ20 మ్యాచ్ జరిగింది. అంతర్జాతీయంగా జరిగిన ఈ పోరులో అత్యంత చెత్త రికార్డులు నమోదయ్యాయి. తొలుత బ్యాటింగ్ చేసిన పర్యటక జట్టు ఐసిల్ ఆఫ్ మ్యాన్ 8.4 ఓవర్లపాటు బ్యాటింగ్ చేసి కేవలం 10 పరుగులు చేసింది. మొత్తం అన్ని వికెట్లు కోల్పోయింది. ఈ టీమ్ లో ఒక్కరంటే ఒక్కరు కూడా రెండంకెల స్కోరు చేయలేకపోయారు. మొత్తం 6 గురు బ్యాటర్లు డకౌట్ అయ్యారు. ఈ జట్టు ఇన్నింగ్స్ లో ఒక్క ఫోర్ కూడా లేదు. 4 పరుగులు అత్యధిక వ్యక్తిగత స్కోరు. జోసఫ్ బుర్రోస్ ఈ రన్స్ చేశాడు. జార్జ్ బుర్రోస్, లూక్ వార్డ్, జాకబ్ బట్లర్ తలో 2 పరుగులు చేశారు. స్పెయిన్ బౌలర్లలో కమ్రాన్, అతీఫ్ మెహమూద్ తలో 4 వికెట్లు తీశారు. లోర్న్ 2 వికెట్లు పడగొట్టాడు.
ఇక 11 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన స్పెయిన్ జట్టు.. కేవలం 2 బంతుల్లోనే ఆటను పూర్తి చేసింది. తొలి బంతిని జోసఫ్ బుర్రోస్ నో బాల్ వేశాడు. ఆ తర్వాత వేసిన రెండు బాల్స్ ని అవైస్ అహ్మద్ సిక్సర్లు కొట్టాడు. దీంతో 2 బంతుల్లోనే 13 పరుగులు చేసిన స్పెయిన్ చారిత్రక విజయాన్ని అందుకుంది. ఇక ఈ మ్యాచులో భాగంగా పురుషుల టీ20 మ్యాచ్ లో అతి తక్కువ స్కోరు నమోదైంది. ఛేదనలో వేగవంతమైన రనే రేట్ (39), బంతుల పరంగా అతి పెద్ద విజయం (118 బంతులు మిగిలుండగా) లాంటి చెత్త రికార్డులు ఈ మ్యాచులోనే నమోదు కావడం విశేషం. మరి 10 పరుగులకే క్రికెట్ జట్టు ఆలౌట్ కావడంపై మీరేం అంటారు. కింద కామెంట్ చేయండి.
Spain takes just 0.2 overs to chase a target of 11 against Isle of Man.
The win margin by 118 balls remaining is the biggest in all T20 cricket.
— Kausthub Gudipati (@kaustats) February 26, 2023