భారత స్టార్ క్రికెటర్ ఇషాంత్ శర్మ నెలరోజుల పాటు ఏడ్చాడు. ఆ ఒక్క ఇన్సిడెంట్ వల్ల గర్ల్ ఫ్రెండ్ దగ్గర తన బాధ చెప్పుకొని తెగ బాధపడ్డాడు. ఇంతకీ ఇదంతా ఎందుకు జరిగిందో తెలుసా?
క్రికెటర్లు కూడా మనుషులే. వాళ్ల జీవితంలోనూ ఎత్తుపల్లాలు చాలా కామన్. బాగా ఆడినప్పుడు మెచ్చుకున్నవాళ్లే.. సరిగా బ్యాటింగ్ లేదా బౌలింగ్ చేయకపోతే విపరీతంగా విమర్శిస్తారు. వీటన్నింటినీ తట్టుకున్నవాడే ఆటగాడిగా నిలబడగలుగుతాడు. అయితే పాజిటివ్స్ గురించి చెప్పకపోయినా సరే అందరికీ తెలిసిపోతుంది. నెగిటివ్స్ మాత్రం సదరు ఆటగాళ్లు బయటకొచ్చి చెబితే గానీ ఎవరికీ తెలియదు. ఇప్పుడు అలాంటి ఓ ఇంట్రెస్టింగ్ విషయాన్ని టీమిండియా బౌలర్ ఇషాంత్ శర్మ బయటపెట్టాడు. ఓ ఇన్సిడెంట్ వల్ల దాదాపు నెల రోజుల పాటు ఏడుస్తూనే ఉన్నానని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఇది కాస్త క్రికెట్ వర్గాల్లో వైరల్ అయింది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. బౌలర్ ఇషాంత్ శర్మ గురించి అభిమానులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టీమిండియా తరఫున ఎన్నో మ్యాచులాడిన ఇతడు.. దాదాపు పదేళ్ల క్రితం అంటే 2013లో భారత జట్టు ఘోరంగా ఓడిపోవడానికి కారణమయ్యాడు. మొహాలీ వేదికగా జరిగిన ఈ వన్డేలో ఆస్ట్రేలియా జట్టు మూడు ఓవర్లలో 44 పరుగులు చేయాలి. ఆ టైంలో బౌలింగ్ చేసిన ఇషాంత్ శర్మ.. ఒకే ఓవర్ లో 30 రన్స్ ఇచ్చేశాడు. దీంతో ఆసీస్ జట్టు సులభంగా మ్యాచ్ గెలిచేసింది. అప్పట్లో టీమిండియా ఓటమికి కారణమైన ఇషాంత్ శర్మని దాదాపు ప్రతి ఒక్కరూ ట్రోల్ చేశారు. దీంతో అతడు చాలా మానసిక క్షోభని అనుభవించినట్లు తెలుస్తోంది. ‘రైజ్ ఆఫ్ న్యూ ఇండియా’ షోలో మాట్లాడుతూ.. తాజాగా ఆ విషయాన్ని గుర్తుచేసుకున్నాడు.
‘2013 మొహాలీలో ఆస్ట్రేలియాతో ఆడిన వన్డే నాకు బ్యాడ్ ఎక్స్ పీరియెన్స్. నా కెరీర్ లో ఇంతకంటే దారుణమైన టైం ఉండదు. ఎక్కువ రన్స్ ఇచ్చినందుకు కాదు, నా వల్లే మ్యాచ్ ఓడిపోయిందనే బాధ నన్ను చాలా డిప్రెష్ అయ్యేలా చేసింది. ఆ సమయంలో నా భార్యతో డేటింగ్ చేస్తున్నాను. ఆమెతో కాల్ మాట్లాడిన ప్రతిసారి నాకు కన్నీళ్లు వచ్చేవి. దాదాపు ఓ నెలపాటు ఏడుస్తూనే ఉన్నాను. మ్యాచ్ తర్వాత ధోనీ, ధావన్ నా రూమ్ కు వచ్చారు. బాగానే ఆడుతున్నావ్ ప్రోత్సాహం అందించారు. అయితే ఆ మ్యాచ్ వల్ల నేనే వైట్ బాల్ క్రికెటర్ ను కాను అనే అభిప్రాయం ఏర్పడింది.’ అని అప్పటి పరిస్థితుల్ని ఇషాంత్ గుర్తుచేసుకున్నాడు. ఇదిలా ఉండగా చివరగా 2021లో టీమిండియా తరఫున టెస్టు ఆడాడు. ఇప్పటివరకు 311 వికెట్లు తీశాడు. ప్రస్తుతం ఫామ్ లేమితో ఇబ్బంది పడుతున్న ఇషాంత్.. రీఎంట్రీ ఇచ్చేందుకు చాలా కష్టపడుతున్నాడు. మరి ఇషాంత్ నెలరోజుల పాటు ఏడవడంపై మీరేం అనుకుంటున్నారు. కింద కామెంట్ చేయండి.