టీ20 ప్రపంచకప్ లో టీమిండియా సెమీస్ లోనే ఇంటిదారి పట్టిన సంగతి తెలిసిందే. ఇది పక్కన పెడితే.. ఇంగ్లాండ్ తో జరిగిన సెమీస్ పోరులో 10 వికెట్ల తేడాతో ఓటమిపాలయ్యింది. ఈ వైఫల్యంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ర్యాంకుల్లో నెంబర్ 1గా ఉండే భారత జట్టు, ప్రతిష్టాత్మక ఐసీసీ టోర్నీల్లో ఇలా మరోసారి అవమానకర రీతిలో నిష్క్రమించడం ఫ్యాన్స్ తో పాటు మాజీ క్రికెటర్లకూ ఆగ్రహాన్ని తెప్పించింది. దీంతో సీనియర్ ఆటగాళ్లను జట్టు నుంచి తప్పించి, టీ20 ఫార్మాట్ కు కొత్త జట్టు, కెప్టెన్ లను నియమించాలని సూచిస్తున్నారు. ఈ జాబితాలోకి భారత మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ కూడా చేరాడు.
ట్విట్టర్ వేదికగా స్పందించిన ఇర్ఫాన్ పఠాన్.. భారత క్రికెట్ రూపురేఖలు మార్చేందుకు నాలుగు పాయింట్ల ఫార్ములాను సూచించాడు. “ఇండియా క్రికెట్ ముందుకెళ్లాలంటే.. 1) ఓపెనర్లు స్వేచ్ఛగా ఆడగలగాలి.. కనీసం ఒక్కరైనా ఫ్రీగా బ్యాటింగ్ చేయాలి. 2) మణికట్టు స్పిన్నర్ జట్టులో తప్పకుండా ఉండాలి. అతడు వికెట్ టేకర్ అయిఉండాలి. 3) ఎప్పుడూ ఫిట్ గా ఉండే ఫాస్ట్ బౌలర్ జట్టుకు చాలా అవసరం. 4) కెప్టెన్లను మారిస్తే కప్పులు రావు.. అలా చేయడం వల్ల ఫలితం వస్తుందని దయచేసి అనుకోకండి. ఆడే విధానంలో మార్పులు రావాలి. మార్చుకోవాల్సినవి ఇవి..” అని ట్వీట్ చేశాడు.
Indian cricket going forward 1) Openers playing freely, At least one of them. 2) Wrist spinner (wicket taker ) is must. 3) Tear away fast bowler. 4) please don’t think changing captaincy will give us changed result. It’s the approach what needs to change.
— Irfan Pathan (@IrfanPathan) November 15, 2022
అయితే.. టీ20 ప్రపంచకప్ లో విఫలయ్యాక రోహిత్ శర్మ మరోసారి టీ20 కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టడం అనుమానమే. న్యూజిలాండ్ సిరీస్ కు సారధిగా హార్ధిక్ పాండ్యాను నియమించారు. టీ20లకు అతన్నే రెగ్యులర్ కెప్టెన్ గా నియమించాలంటూ డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ విషయంపై స్పందించిన పఠాన్.. “కెప్టెన్ ను మారిస్తే ఫలితాలు మారవు. పాండ్యాను సారథిగా నియమించాలని అంటున్నారు. ఐపీఎల్ లో గుజరాత్ టైటాన్స్ సారథిగా అతడు సక్సెస్ అయ్యిండొచ్చు. ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయమేమిటంటే.. పాండ్యా ఫాస్ట్ బౌలింగ్ ఆల్ రౌండర్. కావున అతడు కూడా గాయాలకు అతీతుడు కాడు. మెగా టోర్నీల ముందు జట్టు సారథి గాయపడితే ఎలా..? నేను చెప్పేది ఏంటంటే గ్రూపులో ఒకరు కాకుండా గ్రూప్ ఆఫ్ లీడర్స్ ఉండాలి..” అని అర్థం కాని మాటలతో బదులిచ్చాడు.
Hey skip 🤩… Can’t wait to see you lead #TeamIndia against New Zealand! 🙌#PapaPandya #NZvIND
[📷: @hardikpandya7] pic.twitter.com/gUMX819f5k— Gujarat Titans (@gujarat_titans) November 14, 2022