ఆస్ట్రేలియా స్పిన్ మాంత్రికుడు, లెజెండరీ స్పిన్ బౌలర్ షేన్ వార్న్ మరణ వార్త ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులను ఎంతగానో కలచివేసింది. ఇక అతడిని ఆరాధించే వాళ్లకైతే అది తీరని క్షోభను మిగిల్చింది. ఈ జాబితాలో ఎల్లప్పుడూ ముందుండే ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్.. తన అభిమాన క్రికెటర్ ని కడసారి చూసుకోవటానికి ఆస్ట్రేలియా వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. ఈ విషయాన్ని అతనే స్వయంగా ప్రకటించాడు. ప్రస్తుతం పాకిస్థాన్ పర్యటనలో ఉన్న వార్నర్.. టెస్ట్ సిరీస్ ముగిసిన వెంటనే తన అభిమాన క్రికెటర్ తుది వీడ్కోలు కార్యక్రమానికి హాజరవుతానని వెల్లడించాడు. పాక్‌తో మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ఈనెల 25తో ముగియనుండగా, వార్న్ అంతిమ సంస్కారాలు ఈనెల 30న మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో జరగనున్నాయి.
వార్నర్ తీసుకున్న ఈ నిర్ణయం.. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుపై తీవ్ర ప్రభావం చూపనుందని తెలుస్తోంది. ఈ ఏడాది ఐపీఎల్.. ఈనెల 26 నుంచి ప్రారంభంకానుండగా.. పలు ప్రారంభ మ్యాచ్‌లకు వార్నర్ దూరం కానున్నాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియా జట్టు పాకిస్థాన్ లో పర్యటిస్తోంది. ఏప్రిల్ 6 వరకు సాగే ఈ పర్యటనలో వన్డే, టీ20 సిరీస్ లో పాల్గొనని వార్నర్ ముందుగానే ప్రకటించాడు. ఐపీఎల్ మ్యాచ్‌లు మిస్ కాకూడదనే ఉద్దేశంతో వార్నర్ ఇదివరకే ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు నుంచి ప్రత్యేక అనుమతి తీసుకున్నాడు. ఐపీఎల్ మెగా వేలంలో ఢిల్లీ జట్టు వార్నర్‌ను రూ. 6.5 కోట్లకు దక్కించుకున్న సంగతి తెలిసిందే.మరోవైపు.. పాక్ పర్యటన కారణంగా పలువురు ఆసీస్ ఆటగాళ్లు.. ఐపీఎల్ 2022 ప్రారంభ మ్యాచ్‌లకు దూరం కానున్నారు. ఏప్రిల్ 6తో పాక్ సిరీస్ ముగిసినప్పటికీ, క్వారంటైన్ నిబంధనల కారణంగా, మరో వారం రోజులపాటు బెంచ్‌కే పరిమితమవునున్నారు. ఈలోపు దాదాపు 25 లీగ్ మ్యాచ్‌లు పూర్తవుతాయి. ఈ నేపథ్యంలో ఆసీస్ ఆటగాళ్లను సొంతం చేసుకున్న ఆయా ఫ్రాంచైజీలు ఆందోళన పడుతున్నాయి.
David Warner says Shane Warne touched so many people, and his funeral will be a very emotional occasion. pic.twitter.com/gBRIE2jkvJ
— Sky Sports Cricket (@SkyCricket) March 10, 2022
One of the funniest bits of commentary when Nicholas and Shane Warne jinx David Warner, out in the 90s.
>>Nicholas: Warner has never been out in 90s in Tests>>Warne: Oh no! What did you just say
NEXT BALL! –
Warner nicks one on 97 pic.twitter.com/QfTsVggahG— kuldeep sharma (@Brahman_Kuldip) March 5, 2022