ఐపీఎల్ 2022 మెగా వేలం పూర్తయిన నేపథ్యంలో.. ఏయే వేదికలపై మ్యాచులు నిర్వహించాలన్న దానిపై భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) కసరత్తులు మొదలు పెట్టింది. నేడు(ఫిబ్రవరి 24) జరిగే ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్‌లో షెడ్యూల్, వేదికలపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికి ఇంకా షెడ్యూల్ విడుదల కానప్పటికీ.. లీగ్ మ్యాచ్‌లు ముంబై, పుణేల వేదికలుగా నిర్వహించాలనే ఆలోచనలో బోర్డు ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ సీజన్లో మొత్తం 70 మ్యాచ్ జరగనున్నట్లు తెలుస్తోంది. ఇందులో 55 లీగ్ మ్యాచ్‌లను ముంబైలో, 15 మ్యాచ్‌లను పుణేలో నిర్వహించేందుకు ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ముంబైలోని వాంఖడే, బ్రబౌర్న్, డీవై పాటిల్ స్టేడియాల్లో, పుణెలోని ఏంసీఏ స్టేడియంలో మ్యాచ్‌లు జరిగే అవకాశం ఉంది. వాస్తవానికి మార్చి 27న లీగ్ మొదలుపెట్టాలని బోర్డు ముందుగా అనుకుందని సమాచారం. అయితే,.. ఆ రోజు ఆదివారం కావడంతో ఒక రోజు ముందగా శనివారం లీగ్ స్టార్ట్ చేస్తే.. తర్వాతి రోజు ఆదివారం డబుల్ హెడర్ (రెండు మ్యాచ్‌లు) జరిపే వీలుంటుందని బ్రాడ్ కాస్టర్స్ కోరడంతో బీసీసీఐ.. ఆ దిశగా ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.
🏆 COUNTDOWN HAS BEGUN! Which venues do you think the IPL 2022 playoffs should be held? 🤔⏬
📸 IPL • #ipl #ipl2022 #cricket #TATAIPL #lovecricket #BharatArmy pic.twitter.com/YNJ4gvhS9l
— The Bharat Army (@thebharatarmy) February 23, 2022
టోర్నీ ఎప్పుడు మొదలవుతుందనే దానిపై ఇప్పటివరకు స్పష్టత లేదు. ఈ క్రమంలో మార్చి 26 లేదా 27న ప్రారంభమై మే 29 న ముగిసేలా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ప్లేఆఫ్స్ వేదికలు ఇంకా ఖరారు కాలేదు. లీగ్‌లోకి కొత్తగా రెండు ఫ్రాంఛైజీలు ఎంట్రీ ఇవ్వడంతో ఐపీఎల్ జట్ల సంఖ్య పదికి పెరగడంతో మ్యాచ్‌ల సంఖ్య కూడా పెరిగింది. ఇలా ఒకే నగరంలో 55 మ్యాచ్ లు నిర్వహిస్తే లోకల్ టీంకు అడ్వాంటేజ్ గా మారుతుందని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఇలా రెండు వేదికలకు 70 మ్యాచులను పరిమితం చేయడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.