”దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకొవాలి” అని అంటూ ఉంటారు మన పెద్దలు. ఈ సామెతను సామాన్యమానవుల కంటే సెలబ్రిటీలే ఎక్కువ పాటిస్తారు. అందుకు తగ్గట్టే వారు రెండు చేతులా సంపాదిస్తారు. కొందరు ఓ వైపు తమ వృత్తిని కొనసాగిస్తూనే మరోవైపు బిజినెస్ లలో పెట్టుబడులు పెడతారు. మరి కొందరు తమ వృత్తికి వీడ్కోలు పలికాక ఇండస్ట్రీకి వస్తారు. ఇప్పుడు ఇదే కొవలోకి వస్తున్నాడు ఓ ఇండియన్ మాజీ క్రికెటర్. మరిన్ని వివరాల్లోకి వెళితే..
క్రికెటర్ వినయ్ కుమార్.. టీంఇండియా తరుపున మూడు ఫార్మాట్లలో ఆడాడు. గాయాల కారణంగా జట్టులో చోటుని నిలబెట్టుకొలేక పోయాడు. దీంతో తక్కువ కాలంలోనే తన అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికాడు. అయినప్పటికీ ఐపీఎల్ లో మాత్రం తనదైన బౌలింగ్ తో సత్తా చాటాడు. ముంబై ఇండియన్స్, కోల్ కత్తా నెైట్ రెడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ జట్లకు అతను ప్రాతినిధ్యం వహించాడు. ఈ నేపథ్యంలో అతను బుల్లితెరలోకి అడుగుపెడుతున్నట్లు తెలిసింది.
ప్రముఖ రియాల్టీ షో అయిన బిగ్‌బాస్‌లో అతను అడుగుపెట్టబోతున్నాడు. త్వరలో ప్రారంభం కానున్న కన్నడ బిగ్‌బాస్ షో ఓటీటీ వెర్షన్‌కు అతను ఎంపికయ్యాడు. ఈ మేరకు బిగ్‌బాస్ కన్నడ రిలీజ్ చేసిన లిస్ట్ ఆఫ్ కంటెస్టెంట్లలో అతని పేరు ఉంది. ఇక ఈ షోకు ప్రముఖ కన్నడ స్టార్ కిచ్చా సుదీప్ వ్యాఖ్యతగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఈ షోను Voot ఓటీటీ యాప్ డిజిటల్ స్ట్రీమింగ్ చేయనుంది. ఆగస్టు 6నుంచి కన్నడ బిగ్‌బాస్ షో ఓటీటీ ప్రసారం కానుంది.
దీని ప్రత్యేకత ఏంటంటే ఈ షోను 24 గంటలు చూసేందుకు ప్రేక్షకులకు అవకాశం ఉంది. ఈక్రమంలో క్రికెటర్ గా రాణించిన వినయ్ కుమార్ బుల్లితెరపై ఏవిధంగా మెరుస్తాడో చూడాలి మరి. బిగ్ బాస్ లోకి అడుగుపెడుతున్న ఈ మాజీ ఆటగాడిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: వీడియో: కామన్‌వెల్త్ గేమ్స్ లో అపశ్రుతి.. తీవ్రంగా గాయపడ్డ భారత మహిళా సైక్లిస్ట్!
ఇదీ చదవండి: గాయంతోనే రజతాన్ని సాధించిన సుశీలా దేవి! హ్యాట్సాఫ్ అంటూ ప్రశంసలు..