స్టార్ హీరో సుదీప్ ని బెదిరిస్తూ ఏప్రిల్ ఓ ఆగంతక వ్యక్తి లెటర్ పంపాడు. ఇప్పుడు ఆ కేసులో భాగంగా ఓ ప్రముఖ డైరెక్టర్ ని పోలీసులు అరెస్ట్ చేశాడు. ఇదికాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.
కిచ్చా సుదీప్ పేరుకే కన్నడ హీరో. కానీ తెలుగులోనూ అద్భుతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. ఇప్పటికీ చాలామంది టాలీవుడ్ లో ‘ఈగ’ సుదీప్ అని పిలుస్తారు. అంతలా గుర్తింపు తెచ్చుకున్నాడు. ‘విక్రాంత్ రోణ’తో ప్రేక్షకుల్ని పలకరించిన సుదీప్.. ఈ మధ్య కాలంలో పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. గత నెలలో సుదీప్ ని బెదిరిస్తూ ఓ లెటర్ వచ్చింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. ఇప్పుడు ఆ కేసులో భాగంగా ఓ డైరెక్టర్ ని అరెస్ట్ చేశారు. ఇంతకీ ఏం జరుగుతోంది? ఈ కేసు సంగతేంటి?
ఇక వివరాల్లోకి వెళ్తే.. కన్నడ ఇండస్ట్రీలోని స్టార్ హీరోల్లో సుదీప్ ఎప్పుడూ టాప్ లో ఉంటాడు. యాక్టర్, రైటర్, డైరెక్టర్, ప్రొడ్యూసర్.. ఇలా చాలా విభాగాల్లో తనదైన ప్రతిభ చూపిస్తున్నాడు. అలాంటిది గత నెలలో సుదీప్ కి ఓ బెదిరింపు లేఖ వచ్చింది. ఇప్పుడు అది పంపింది సుదీప్ క్లోజ్ ఫ్రెండ్, డైరెక్టర్ రమేష్ కిట్టి అని తెలుస్తోంది. వీళ్లిద్దరూ కలిసి సుదీప్ ఛారిటబుల్ ట్రస్ట్ నిర్వహిస్తున్నారు. డైరెక్ట్ రమేష్, దీనికి ప్రెసిడెంట్. అయితే ట్రస్ట్ ఫండ్స్ విషయంలో సుదీప్-రమేష్ మధ్య మనస్పర్థలు వచ్చినట్లు తెలుస్తోంది.
ప్రెసిటెంట్, డైరెక్టర్ రమేష్ కిట్టీ.. ట్రస్టులో రూ.2 కోట్లు పెట్టగా, ఆ డబ్బు విషయంలో సుదీప్ మోసం చేశాడని అంటున్నారు. అందులో అతడిని బెదిరిస్తూ సదరు డైరెక్టర్ రమేష్ లెటర్స్ పంపినట్లు తెలుస్తోంది. అయితే ఇందులో రమేష్ తోపాటు పలువురు హస్తం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఏదేమైనా సుదీప్ బెదిరింపుల కేసు వ్యవహారం రోజురోజుకి ఆసక్తికరంగా మారుతోంది. చివరకు ఏం తేలుతుందనేది చూడాలి. సుదీప్ ని బెదిరించిన కేసులో డైరెక్టర్ ని అరెస్ట్ చేయడంపై మీరేం అనుకుంటున్నారు? కింద కామెంట్ చేయండి.
Kichcha Sudeep’s close friend Ramesh Kitty arrested in threat letter case. Details pic.twitter.com/92tCH3HVPr
— Times No1 (@no1_times) May 6, 2023