టోక్యో పారాలింపిక్స్‌లో భారత అథ్లెట్లు పతకాల పంట పండిస్తున్నారు. భారత షూటర్ అవని లేఖరా చరిత్ర సృష్టింటింది. ఒకే పారాలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన తొలి భారతీయురాలిగా రికార్డు నెలకొల్పింది. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో స్వర్ణం సాధించి అవని లేఖరా పారాలింపిక్స్‌లో స్వర్ణం గెలిచిన తొలి మహిళగా రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. తాజాగా శుక్రవారం జరిగిన 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్ ఎస్‌హెచ్1 విభాగంలో కాంస్యం గెలిచింది అవని.
ఒకటి కంటే ఎక్కువ పారాలింపిక్స్ పతకాలు గెలిచిన నాలుగో భారత పారా అథ్లెట్‌గా అవని లేఖరా రికార్డుల్లోకి ఎక్కింది. ఆమె కంటే ముందు జోగిందర్ సింగ్ బేడీ, మరియప్పన్ తంగవేళు, దేవేంద్ర ఝాజరియా తర్వాతి స్థానంలో అవని చేరింది.