జపాన్ వేదికగా జరగుతున్న టోక్యో పారాలింపిక్స్ 2020లో రికార్డుల మోత, పతకాల వేట మామూలే. అందుకు భిన్నంగా టోక్యో ఓ జంట నిండు జీవితంలో తొలి అడుగుకు వేదికైంది. ఆ అంధ అథ్లెట్‌కు పతకం అయితే దక్కలేదు కానీ, పచ్చని జీవితానికి చక్కటి తోడు దొరికింది. ‘ట్రాక్’పై ప్రపోజ్ చేసి ఓ గైడ్ తన వైవాహిక జీవితానికి అడుగులు వేసిన వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
అసలు విషయం ఏంటంటే కేప్ వర్డే దేశానికి చెందిన అంధ అథ్లెట్ పెరీరా సిమెడో 200 మీటర్ల టీ11 హీట్ పాల్గొంది. ఈవెంట్‌లో నాలుగో స్థానంతో సరిపెట్టుకుంది గానీ, అదే ట్రాక్‌లో ఎంగేజ్‌మెంట్ రింగ్ పట్టేసింది. విజయం సాధించలేకపోయానే అని నిరుత్సాహంగా ఉన్న పెరీరా సిమెడోని చూస్తూ.. అప్పటి వరకు తనను గైడ్ చేసిన మాన్యువల్ ఆంటోనియో మోకాళ్ల మీద కూర్చుని నన్ను పెళ్లి చేసుకుంటావా అంటూ ప్రపోజ్ చేశాడు. ఆమె ఒక్కసారిగా అవాక్కయ్యింది. ఆనందంతో అలా ఉండిపోయింది. తేరుకుని ఆంటోనియో ప్రపోజల్‌కు అంగీకరించింది. అక్కడున్న అథ్లెట్లు అందరూ వీరికి తమ చప్పట్లతో శుభాకాంక్షలు తెలిపారు. పెరీరా సిమెడో, మాన్యువల్ ఆంటోనియో ప్రపోజల్ వీడియోని టోక్యో ఒలింపిక్స్ తమ అఫీషియల్ ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఆ వీడియో తెగ వైరలవుతోంది.