టోక్యో పారాలింపిక్స్‌లో భారత అథ్లెట్ వినోద్‌కుమార్ డిస్కస్ త్రోలో సాధించిన పతకాన్ని వెనక్కి తీసుకున్నారు. పురుషుల డిస్కస్ త్రో ఎఫ్ 52 విభాగంలో 19.91 మీటర్లు డిస్కస్‌ను విసిరి మూడోస్థానంలో నిలిచాడు. అయితే వినోద్ కుమార్ క్లాసిఫికేషన్ సరిగ్గా లేదని భావించిన పారాలింపిక్స్ కమిటీ అతను ఎఫ్ 52 విభాగంలో పోటీ పడేందుకు అనర్హుడిగా తేల్చారు.
ఈ నెల 22నే పారాలింపిక్స్ వర్గీకరణ చేసి తుది జాబితాను విడుదల చేశారు. అందులో భారత అథ్లెట్ వినోద్‌కుమార్ పేరు ఉంది. పోటీ సమయంలో తోటి అథ్లెట్లు వినోద్‌కుమార్ ఎఫ్ 52 విభాగంలో పోటీకి తగిన వైకల్యం లేదని అనుమానాలు వ్యక్త పరిచారు. దాన్నిబట్టి మరోసారి సమీక్షించిన కమిటీ వినోద్‌ను అనర్హుడిగా తేల్చారు. ముందు జాబితాలో పేరు ఉంచి.. పోటీ పడి పతకం గెలిచిన తర్వాత వెనక్కి తీసుకోవడంపై పలు విమర్శలు వ్యక్తమవుతున్నాయి.