టోక్యో పారాలింపిక్స్‌లో భారత్ అథ్లెట్ల పతకాల వేట కొనసాగుతోంది. భారత్ ఖాతాలో మరో కాంస్యం చేరింది. పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ SH1 విభాగంలో షూటర్ సింగ్‌రాజ్ అదానా కాంస్యం సాధించాడు. ఫైనల్‌లో 216.8 పాయింట్లతో సింగ్‌రాజ్ మూడోస్థానంలో నిలిచాడు. 237.9, 237.5 పాయింట్లతో చైనా షూటర్లు స్వర్ణం, రజతాలను సాధించారు. సోమవారం జరిగిన మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో భారత షూటర్ అవని లేఖారా బంగారు పతకం సాధించిన విషయం తెలిసిందే. సింగ్‌రాజ్ అదానా సాధించిన కాంస్యంతో భారత్ ఖాతాలో పతకాల సంఖ్య ఎనిమిదికి చేరింది.