సిరీస్ డిసైడర్ మ్యాచ్‌లో భారత బ్యాటర్లు రెచ్చిపోయారు. ఇషాన్ కిషన్(1) నిరాశపరిచినా, రాహుల్ త్రిపాఠి(35), శుభ్ మాన్ గిల్(48), సూర్యకుమార్ యాదవ్(100) మెరుపులు మెరిపించారు. ఎదుర్కొన్న తొలి బంతి నుంచే లంక బౌలర్లపై ఎదురుదాడికి దిగారు. ముఖ్యంగా మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్ సునామీలా ‘బీభత్సం’ సృష్టించాడు. మిస్టరీ స్పిన్నర్లుగా చలామణి అవుతున్న మహీష్ తీక్షణ, వహిందు హసరంగలను మరోసారి బౌలింగ్ వేయడానికి రాకుండా కొట్టాడు. ఈ క్రమంలో సూర్య 45 బంతుల్లోనే సెంచరీ మార్కు చేరుకున్నాడు.
ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ కు శుభారంభం దక్కలేదు. మధు షనక వేసిన తొలి ఓవర్ లోనే ఇషాన్ కిషన్(1) క్యాచ్ ఔట్ గా పెవిలియన్ చేరాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన రాహుల్ త్రిపాఠి 35(16 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లు), గిల్ 46(36 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లు)తో కలిసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. మహేష్ థీక్షణ వేసిన ఐదో ఓవర్లో మూడు ఫోర్లు బాదిన త్రిపాఠి, కరుణరత్నే వేసిన ఆరో ఓవర్లో సిక్సర్ బాది, ఆ తర్వాత భారీ షాట్‌కు ప్రయత్నించి ఔటయ్యాడు. తరువాత క్రీజులోకి వచ్చిన సూర్య విధ్వంసాన్ని ఆపడం శ్రీలంక బౌలర్ల వల్ల కాలేదు. ప్రతి ఓవర్ లో రెండు.. మూడు బౌండరీలు బాదిన సూర్య 45 బంతుల్లోనే సెంచరీ మార్కు చేరుకున్నాడు. అతని ఇన్నింగ్స్ లో 7 ఫోర్లు, 8 సిక్సులు ఉండటం గమనార్షం. ప్రస్తుతం స్కోర్ 18.3 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 210గా ఉంది. క్రీజులో సూర్య (100 నాటౌట్), క్సర్ పటేల్(8) పరుగులతో ఉన్నారు.
3rd T20I hundred for Suryakumar Yadav from just 43 innings, this is his world in shorter format, the best in the business currently. pic.twitter.com/fO1kWE6kX6
— Johns. (@CricCrazyJohns) January 7, 2023
Another extraordinary innings from Suryakumar Yadav 🤯
He brings up his third T20I century off just 45 balls 💥#INDvSL | 📝Scorecard: https://t.co/v6DELbUa9F pic.twitter.com/hCBjeH0z3S
— ICC (@ICC) January 7, 2023