ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా బ్యాటర్లు ఘోరంగా విఫలం అయ్యారు. దాంతో టీమిండియా బ్యాట్స్ మెన్ లపై ఘాటు వ్యాఖ్యలు చేశాడు ఆసిస్ మాజీ కెప్టెన్ ఇయాన్ చాపెల్.
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో గత రెండు టెస్టులతో పోలిస్తే.. ఆస్ట్రేలియా అంచనాలకు మించి రాణిస్తోంది. ఒక దశలో కంగారులకి వైట్ వాష్ తప్పదనుకున్నారంతా. కానీ ఇప్పుడు ఆస్ట్రేలియా అద్భుత పోరాటంతో మ్యాచ్ మీద పట్టు సాధించింది. అయితే అప్పుడే ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ ఇయాన్ ఛాపెల్ టీమిండియాపై విమర్శలు ఎక్కుపెట్టాడు. ముఖ్యంగా భారత టాప్ ఆర్డర్ బ్యాట్సమెన్ పుజారా, మిడిల్ ఆర్డర్ బ్యాట్సమెన్ శ్రేయస్ అయ్యర్ బ్యాటింగ్ పై దారుణమైన మాటలతో విరుచుకుపడ్డాడు.
ఒక గొప్ప ప్లేయర్ గా, కెప్టెన్ గా ఇయాన్ చాపెల్ కి మంచి పేరుంది. కానీ ఇప్పుడు తన నోటి దూరుసుతో ఇండియన్ క్రికెట్ ప్రేమికులకు టార్గెట్ అయ్యాడు. ఈ క్రమంలోనే మూడో టెస్ట్ పై చాపెల్ మాట్లాడుతూ.. “ఆస్ట్రేలియా స్పిన్నర్లు వచ్చిన అవకాశాల్ని సద్వినియోగం చేసుకొని బాగా బౌలింగ్ చేశారు. తొలి రోజు భారత బ్యాట్స్ మెన్ లను ఇంకా త్వరగా ఆల్ ఔట్ చేస్తారనుకున్నా”. అని చెప్పుకొచ్చాడు. ఈ సందర్భంగా భారత బ్యాటింగ్ ని విశ్లేషిస్తూ.. చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. పుజారా బ్యాటింగ్ గురించి ప్రస్తావిస్తూ.. “పుజారా స్పిన్ ఆడడంలో మరీ బయపడుతున్నాడు. ఈ సిరీస్ మొత్తం కూడా చాలా నెర్వస్ గా కనిపించాడు. ఇక శ్రేయస్ అయ్యర్ అయితే స్పిన్ చాలా బాగా ఆడతాడని విన్నాను. కానీ అతని బ్యాటింగ్ నాకు ఏ మాత్రం సంతృప్తి కరంగా అనిపించట్లేదు. స్పిన్నర్లను ఎదుర్కొనే సమయంలో అతను వీక్ గా కనిపిస్తున్నాడు”. అని వివాదాస్పద వ్యాఖ్యలు చేసాడు చాపెల్.
ఈ వ్యాఖ్యలతో ఇప్పుడు భారత అభిమానులు ఇతనిపై ట్రోలింగ్ కి దిగారు. ఈ టెస్టు వదిలేస్తే మొదటి రెండు టెస్టులకి ఏమని సమాధానమిస్తావ్ అని కౌంటర్ ఇచ్చారు. ఇక ప్రస్తుతం మూడో టెస్టులో భారత్ జట్టు ఓటమికి చేరువగా ఉంది. తొలి ఇన్నింగ్స్ లో విఫలమైన భారత బ్యాట్సమెన్ రెండో ఇన్నింగ్స్ లో కూడా ఏ మాత్రం ప్రభావం చూపలేదు. దీంతో ఆస్ట్రేలియాకి గెలుపు నల్లేరు మీద నడకే అన్నట్లుగా తయ్యారు అయ్యింది. కేవలం 76 పరుగుల టార్గెట్ తో ఆస్ట్రేలియా రేపు బ్యాటింగ్ చేయనుంది. మరి ఇయాన్ ఛాపెల్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను రూపంలో తెలుపండి.