హార్దిక్ పాండ్య గ్రౌండ్ లోనే కాదు సోషల్ మీడియాలో కూడా దూకుడు చూపిస్తున్నాడు. పాండ్య ఎక్కడుంటే అక్కడ హడావుడి కచ్చితంగా ఉంటుంది. తాజాగా ఈ స్టార్ ఆల్ రౌండర్ ఓ అరుదైన రికార్డును సాధించాడు. ఆ ఘనత సాధించిన యంగ్ క్రికెటర్ గా రికార్డు నెలకొల్పాడు.
టీం ఇండియా స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్య ఎక్కడ వుంటే అక్కడ సందడి వాతావరణం ఉంటుంది. ఈ స్టార్ ఆల్ రౌండర్ ఎప్పుడూ ఏదో ఒక విషయంలో వార్తల్లో నిలుస్తూ ఉంటాడు. ఎక్కడున్నా అక్కడ తనదైన ముద్ర వేస్తూ తాను యాక్టీవ్ గా ఉంటూ అభిమానులను కూడా యాక్టీవ్ గా ఉండేలా చేస్తాడు. ఇటీవలే తన భార్యను ప్రేమికుల దినోత్సవ సందర్భంగా మరొకసారి వివాహం చేసుకొని ఒక్కసారిగా అందరి దృష్టిని తనవైపుకు తిప్పుకున్నాడు. ఈ జోరే ఇప్పుడు సోషల్ వేదికగా ఇతనిని టాప్ లో నిలబెట్టింది.
హార్దిక్ పాండ్య గ్రౌండ్ లోనే కాదు సోషల్ మీడియాలో కూడా దూకుడు చూపిస్తున్నాడు. పాండ్య ఎక్కడుంటే అక్కడ హడావుడి కచ్చితంగా ఉంటుంది. ముఖ్యంగా వైస్ కెప్టెన్ గా భారత జట్టు పగ్గాలు అందుకున్న దగ్గరనుండి హార్దిక్ పాండ్య కి బాగా కలిసి వస్తుంది. ఒక పక్క ప్లేయర్ గా, కెప్టెన్ గా రాణిస్తూనే సోషల్ మీడియాలో కూడా ఇప్పుడు రికార్డులు సెట్ చేస్తున్నాడు. ఇన్స్టాగ్రామ్ వేదికగా ఇప్పుడు 25 మిలియన్ల ఫాలోవర్లను సంపాదించి అందరిని ఆశ్చర్యపడేలా చేసాడు. అంతే కాదు అతి చిన్న వయసులో ఇంతమంది ఫాలోవర్లను కలిగిన ఆటగాడిగా రికార్డ్ సృష్టించాడు. ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచిన స్పోర్ట్స్ స్టార్లు కూడా హార్దిక్ పాండ్య కంటే తక్కువ ఫాలోవర్లును కలిగి ఉండడం విశేషం. ఈ లిస్టులో టెన్నిస్ దిగ్గజాలు రఫెల్ నాదల్, రోజర్ ఫెదరర్ సైతం ఈ స్టార్ ఆల్ రౌండర్ కంటే వెనకే ఉండడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.
ఇంత ఘనత సాధించిన హార్దిక్ పాండ్య అభిమానులకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాడు. “ఇంతటి గౌరవం దక్కడం నా అదృష్టం. ప్రతి అభిమాని కూడా నాకు ముఖ్యమే. నాపై ఇంత ప్రేమ చూపించి నన్ను ఈ స్థాయిలో నిలబెట్టినందుకు మీ అందరికి ధన్యవాదాలు. ఇలాగే మీ మద్దతు నాపై ఎప్పుడు ఉండాలనికోరుకుంటున్నాను. అని తన ఇన్స్టాగ్రామ్ లో వెల్లడించాడు’. మరి హార్దిక్ పాండ్య ఇంతమంది ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్లను సంపాదించడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.