SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » sports » Great Cricket Fielder Jonty Rhodes Life Story

జాంటీ రోడ్స్.. అతని ఫీల్డింగ్ చిరుతపులి వేట కన్నా భయంకరం!

చరిత్రలో వేల పరుగులు చేసిన ఆటగాళ్లు చాలా మందే ఉన్నారు. కానీ.., ఫీల్డింగ్ లో మెరుపులు మెరిపిస్తూ.. వేల పరుగులు ఆపిన ఆటగాడు మాత్రం ఒక్కడే. అతనే జాంటీ రోడ్స్. ఫీల్డింగ్ తో కూడా మ్యాచ్ లు గెలిపించవచ్చు అని మొదటిసారి నిరూపించిన ఆ వీరుడి కథ ఇప్పుడు మనం తెలుసుకుందాం.

  • Written By: Babu Policharla
  • Updated On - Sat - 22 July 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
జాంటీ రోడ్స్.. అతని ఫీల్డింగ్ చిరుతపులి వేట కన్నా భయంకరం!

అది 1992 వరల్డ్ కప్. దక్షిణాఫ్రికా టీమ్ లోకి “జాంటీ రోడ్స్” అనే ఓ కుర్రాడు సెలక్ట్ అయ్యాడు. లోయర్ మిడిల్ ఆర్డర్ లో బ్యాటింగ్. బౌలింగ్ కూడా రాదు. ఇంకా చెప్పాలంటే అతను ఓ సాధారణ బ్యాటర్ అంతే. ప్రపంచ కప్ లో మ్యాచులు ముందుకు వెళ్తున్నాయి. సౌత్ ఆఫ్రికా విజయాలు సాధిస్తుంది. కానీ.., ఆ కుర్రాడు మాత్రం అంత ప్రభావం చూపించడం లేదు. ఒక్కో మ్యాచ్ లో అతనికి అసలు బ్యాటింగ్ చేసే ఛాన్స్ కూడా రావడం లేదు. ఇంతలో దక్షిణాఫ్రికా జట్టు పాక్ తో తలపడాల్సి వచ్చింది. ఆ మ్యాచ్ లో మొదటగా బ్యాటింగ్‌ చేసిన దక్షిణాఫ్రికా జట్టు 50 ఓవర్లలో 211 పరుగులు చేసింది. అయితే పాక్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో మ్యాచ్ కి వర్షం అంతరాయం కల్గించడంతో టార్గెట్ 36 ఓవర్లకు 194 పరుగులకే కుదించారు. రెండు వికెట్ల నష్టానికి 135 పరుగులతో పాక్ పటిష్ట స్థితిలో నిలిచింది. ఇంకేముంది దక్షిణాఫ్రికా ఓటమి ఖాయమని అంతా ఫిక్స్ అయ్యారు. కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ తో పాటు ఇంజమామ్ (48) పాక్ ని విజయం దిశగా తీసుకెళ్తున్నారు. అయితే.. ఇక్కడే అసలు ట్విస్ట్ చోటు చేసుకుంది.

అలెన్ డోనాల్డ్ బౌలింగ్ లో ఇంజమామ్ షాట్ ఆడగా.. బాల్ ప్యాడ్స్ కు తగిలి పాయింట్ దిశగా వెళ్ళింది. యువకుడిగా మంచి ఊపు మీద ఉన్న ఇంజమామ్ పరుగు కోసం కాస్త ముందుకి వెళ్ళాడు. అంతే…ఆ బంతిని చురుగ్గా అందుకున్న జాంటీ రోడ్స్.. చిరుతలా పరిగెత్తి.. గాలిలోకి డైవ్ చేసి వికెట్లను గిరాటేసాడు. ఒక్క పాకిస్థాన్ జట్టు మాత్రమే కాదు, క్రికెట్ ప్రపంచం మొత్తం నివ్వెరపోయిన క్షణాలు అవి. “ఆ రనౌట్ చేసే సమయంలో.. ఆ కుర్రాడి నరం, రక్తం, వేగం, వాడి, విసురు, చురుకుదనం, పరుగు, ఏకాగ్రత” అంతా ఒక అద్భుతం. నిజానికి అతను గాలిలో ఎగిరాడా? గాలి కన్నా వేగంగా దూసుకొచ్చాడా కూడా తెలియని అయోమయం అందరిది. ఆ రనౌట్ తరువాత ఒత్తిడిలోకి వెళ్లిన పాకిస్థాన్ చివరకు 20 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఆ ఒక్క రనౌట్ తో జాంటీ రోడ్స్ అంటే ఏమిటో మాత్రమే కాదు, అసలు క్రికెట్ లో ఫీల్డింగ్ కి ఎంతటి ప్రాధాన్యత ఉంటుందో అందరికీ తెలిసి వచ్చింది. క్రికెట్ లో జాంటీ రోడ్స్ చేసిన ఈ రనౌట్ ఆల్ టైం బెస్ట్ రానౌట్ గా ఇప్పటికీ పరిగణిస్తారు. ఒక ఫీల్డర్ చేసిన రనౌట్ క్రికెట్ ప్రపంచాన్ని విస్తుగొలిపింది. రోడ్స్ ఎలాంటి ఫీల్డరో చెప్పడానికి ఈ ఒక్క రనౌట్ చూస్తే అర్ధం అవుతుంది. అప్పట్లో ఐసీసీ ఈ రనౌట్ ని ఫీట్‌ను స్నో స్టాపింగ్‌ మూమెంట్‌ పేరుతో షేర్‌ చేయడం విశేషం.

Jhonty Rhodes Bio (3)

అప్పటివరకు ఫీల్డింగ్ అంటే మూస ధోరణిలో ఉండే రోజుల్లో ఫీ​ల్డింగ్‌కు కొత్త అర్ధం చెప్పిన రోడ్స్‌.. క్రికెట్‌ చరిత్రలోనే అత్యుత్తమ ఫీల్డర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. బ్యాటర్లు అతను ఫీల్డింగ్ చేస్తున్న వైపు ధైర్యంగా షాట్స్ ఆడలేకపోయే వారంటే రోడ్స్ ఫీల్డింగ్ ఏ రేంజ్ లో ఉండేదో అర్ధం చేసుకోవచ్చు. ఎంతో మంది గ్రేట్ బ్యాటర్లను కూడా తన ఫీల్డింగ్ విన్యాసాలతో బోల్తా కొట్టించి క్రికెట్ చరిత్రలోనే ఒక ట్రెండ్ సృష్టించాడు. అప్పట్లో గ్రేట్ బ్యాటర్లు, బౌలర్లు, ఆల్ రౌండర్లు చాల మంది ఉండేవారు. కానీ ఫీల్డింగ్ అంటే మాత్రం ఈ దక్షిణాఫ్రికా సంచలనమే గుర్తుకొచ్చేవాడు. దశాబ్దం పైగా దక్షిణాఫ్రికా జట్టుకు ఆడిన రోడ్స్ ఎన్నో డైవ్ క్యాచులు, మరెన్నో మెరుపు రనౌట్ లు కూడా చేసాడు. ఒకరకంగా రోడ్స్ క్రికెట్ లోకి అడుగుపెట్టిన తర్వాతే అన్ని జట్లు ఫీల్డింగ్ మీద దృష్టి సారించాయి. మైదానంలో పాదరసంలా కదులుతూ ఊహకు అందని విన్యాసాలు చేసేవాడు రోడ్స్. కొన్ని సార్లయితే కేవలం తన ఫీల్డింగ్ ప్రతిభతోనే మ్యాచులను గెలిపించిన సందర్భాలు ఉన్నాయి. నమ్మడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఒక్కసారి యూట్యూబ్ లో జాంటీ రోడ్స్ ఫీల్డింగ్ వీడియోస్ చూస్తే మీరు షాక్ లోకి వెళ్లిపోవడం ఖాయం. ఓ సబ్ ట్యూట్ ఫీల్డర్ గా గ్రౌండ్ లోకి దిగి.. 7 క్యాచ్ లు అందుకుని, మ్యాన్ ఆఫ్ దా మ్యాచ్ అవార్డు అందుకున్న ఘనత ఈనాటికీ ఒక్క జాంటీ రోడ్స్ పేరు మీదే ఉంది.

జాంటీ రోడ్స్ మొదట్లో ఒక హాకీ ప్లేయర్. 1992 లో జరిగిన ఒలింపిక్స్ క్రీడల్లో రోడ్స్ జాతీయ జట్టుకి ఎంపికైన దురదృష్టవశాత్తు దక్షిణాఫ్రికా అర్హత సాధించలేకపోయింది. దీంతో క్రికెట్ లోకి అడుగుపెట్టి చాల తక్కువకాలంలోనే ఫీల్డింగ్ లో సంచలనాలు సృష్టించాడు. ఫీల్డింగ్ లో గంటలకొద్ది కష్టపడుతూ 10 మీటర్ల దూరం నుంచి క్యాచ్ అందుకునేందుకు ప్రయత్నించేవాడు. అతని ఫీల్డింగ్ దెబ్బకి బ్యాటింగ్ కూడా మరుగున పడిపోయింది. బ్యాటింగ్ కూడా చక్కగా చేసే రోడ్స్ రివర్స్ స్వీప్ లు అలవోకగా ఆడేసేవాడు. ఆంతేకాదు రివర్స్ స్వీప్ ఆడుతూ సిక్సర్లను కూడా బాదేసి తనలో ఈ టాలెంట్ కూడా ఉందని నిరూపించాడు.రికార్డుల పరంగా చూసుకుంటే వన్డేల్లో దక్షిణాఫ్రికా తరపున 100 క్యాచులు పట్టిన తొలి ఫీల్డర్ గా నిలిచాడు. ఇక 1993 లో ముంబైలో వెస్టిండీస్ తో జరిగిన మ్యాచులో ఏకంగా 5 క్యాచులు పట్టేసి ఔరా అనిపించాడు. ఇప్పటికీ ఈ రికార్డ్ జాంటీ రోడ్స్ పేరు మీద ఉండడం విశేషం. దక్షిణాఫ్రికా తరఫున 245 వన్డేల్లో 35.11 సగటుతో 5935 పరుగులు చేసిన రోడ్స్ భారీ సిక్స్ లు కొట్టడంలోనూ సిద్ధహస్తుడు.

Jhonty Rhodes Bio (3)

అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత కూడా జాంటీ రోడ్స్ ని ఫీల్డింగ్ కోచ్ గా నియమించుకునేందుకు చాల జట్లు ఆసక్తి చూపించాయి. ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ కి ఫీల్డింగ్ కోచ్ గా పని చేసాడు. ఇప్పుడంటే ప్రతి ఒక్కరు ఫీల్డింగ్ మీద దృష్టి పెడుతున్నారు కానీ ఈ అధ్యయనానికి శ్రీకారం చుట్టింది మాత్రం జాంటీ రోడ్స్. రోడ్స్ నుండి స్ఫూర్తి పొందాకనే చాలా దేశాలకు అద్భుతమైన ఫీల్డర్లు దొరికారు. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, సౌత్ ఆఫ్రికా, ఇంగ్లాండ్ వంటి దేశాలకు ఇలాంటి అద్భుతమైన ఫీల్డర్స్ దొరికారు. ఇక జాంటీ రోడ్స్ అనే సూర్యుడు.. క్రికెట్ గగనాన అస్తమిస్తున్న రోజుల్లో.. మన ఇండియాకి కూడా కైఫ్, యువరాజ్ వంటి మెరుపు ఫీల్డర్లు దొరికారు. అప్పట్లో కైఫ్, యువరాజ్ ఫీల్డింగ్ చూశాక కూడా.. ప్రేక్షకులు అంతా వారిని.. ఇండియన్ జాంటీ రోడ్స్ అని పోలుస్తూ వచ్చారు. బాగా బ్యాటింగ్ ఆడిన ప్రతి బ్యాటర్ కు సచిన్ స్ఫూర్తి కాకపోవచ్చు. బాగా బౌలింగ్ వేసే ప్రతి బౌలర్ కు వసీం అక్రమ్ ఇన్స్ ప్రేషన్ కాకపోవచ్చు. కానీ.., ఇప్పటికీ బాగా ఫీల్డింగ్ చేసే ప్రతి ఫీల్డర్ కు జాంటీ రోడ్స్ ఒక్కడు మాత్రమే స్ఫూర్తి.

Tags :

  • Cricket Fielder
  • Cricket South Africa
  • Cricket World Cup
  • Hockey player
  • Jonty Rhodes
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Jonty Rhodes: ఐపీఎల్ లో జాంటీ రోడ్స్ గొప్ప మనసు ! ఇలా ఎవ్వరూ చేయలేరేమో!

Jonty Rhodes: ఐపీఎల్ లో జాంటీ రోడ్స్ గొప్ప మనసు ! ఇలా ఎవ్వరూ చేయలేరేమో!

  • ఐపీఎల్ డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ కు షాక్.. స్టార్ ప్లేయర్ దూరం!

    ఐపీఎల్ డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ కు షాక్.. స్టార్ ప్లేయర్ దూరం!

  • రోజు కూలీగా హాకీ ప్లేయర్! సీఎం ఎంట్రీతో మారిన సీన్!

    రోజు కూలీగా హాకీ ప్లేయర్! సీఎం ఎంట్రీతో మారిన సీన్!

  • పేరుకే స్టార్ ప్లేయర్.. ఉండేది మాత్రం పెంకుటింట్లో! టీమిండియా ప్లేయర్ దీనగాథ..

    పేరుకే స్టార్ ప్లేయర్.. ఉండేది మాత్రం పెంకుటింట్లో! టీమిండియా ప్లేయర్ దీనగాథ..

  • అర్షదీప్ ముందు ఆ పాక్ దిగ్గజం కూడా పనికిరాడు! జాంటీ రోడ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు..

    అర్షదీప్ ముందు ఆ పాక్ దిగ్గజం కూడా పనికిరాడు! జాంటీ రోడ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు..

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam