ఇప్పటివరకు ఈ ఐపీఎల్ లో చాలామంది క్రికెటర్లు తమ గొప్ప మనసు చాటుకున్న సంగతి తెలిసిందే. అయితే వాటన్నిటినీ మించి నిన్న జరిగిన మ్యాచులో ఆకట్టుకునే సంఘటన జరగడం విశేషం. దక్షిణాఫ్రికా మాజీ బ్యాటర్, ప్రస్తుత లక్నో సూపర్ జయింట్స్ ఫీల్డింగ్ కోచ్ జాంటీ రోడ్స్ తన గొప్ప మనసుని చాటుకొని అందరి హృదయాలను గెలుచుకున్నాడు.
ఐపీఎల్ 2023 లో కావాల్సిన మసాలాలు అన్ని దొరుకుతున్నాయి. ఒక సినిమాకి ఎలాంటి కమర్షియల్ ఎలెమెంట్స్ కావాలో అన్ని రకాల సంఘటనలు ఐపీఎల్ లో జరుగుతున్నాయి. లో స్కోరింగ్ థ్రిల్లర్స్, కిక్ ఇచ్చే భారీ స్కోర్లు, వివాదాలు, విమర్శలు, అభిమానుల కోలాహలం ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. వీటితో పాటుగా ఇప్పటివరకు ఈ ఐపీఎల్ లో చాలామంది క్రికెటర్లు తమ గొప్ప మనసు చాటుకున్న సంగతి తెలిసిందే. అయితే వాటన్నిటినీ మించి నిన్న జరిగిన మ్యాచులో ఆకట్టుకునే సంఘటన జరగడం విశేషం. దక్షిణాఫ్రికా మాజీ బ్యాటర్, ప్రస్తుత లక్నో సూపర్ జయింట్స్ ఫీల్డింగ్ కోచ్ జాంటీ రోడ్స్ తన గొప్ప మనసుని చాటుకొని అందరి హృదయాలను గెలుచుకున్నాడు.
“జాంటీ రోడ్స్” ఈ పేరు గురించి ఇప్పటి జనరేషన్ కి పెద్దగా పరిచయం లేకపోవచ్చు కాని 1990 ల్లో ఈ పేరు తెలియని వారు ఎవ్వరూ ఉండరు. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో రాణించి లెజెండ్ క్రికెటర్లుగా గుర్తింపు పొందినవారు చాలా మంది ఉన్నారు. కానీ ఈ సౌత్ ఆఫ్రికా ఆటగాడు ఫీల్డింగ్ లో తనదైన ముద్ర వేసి ఫీల్డింగ్ అనే పదానికే నిర్వచనంగా మారాడు. ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు ఈ మాజీ క్రికెటర్ మ్యాచ్ సందర్భంగా చేసిన ఒక పని ఇప్పుడు అందరిని ఆకట్టుకుంటుంది. ఎదుటి వారు ఎవరైనా వారికి సహాయం చేయాలి, ఎంత ఎదిగిన ఒదిగి ఉండాలనే దానికి ఉదాహరణగా నిలిచాడు.
ఐపీఎల్ లో భాగంగా నిన్న లక్నో సూపర్ జయింట్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. అయితే లక్నో టీమ్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో చివరి ఓవర్లో మ్యాచ్ కి వర్షం అంతరాయం కలిగించింది. ఈ నేపథ్యంలో గ్రౌండ్ స్టాఫ్ పిచ్ కవర్ చేయడానికి జాంటీ రోడ్స్ వారికి సహాయం చేస్తూ కనిపించాడు. వారితో పాటు ఆ పిచ్ ని కప్పే కవర్ ని లాగుతూ తన వంతు సహాయం చేసి ఔదార్యాన్ని ప్రదర్శించాడు. ఆ కవర్ ఎంతో బరువుగా ఉండి లాగడానికి చాలా కష్టం ఉంటుంది. అంతేకాక తీవ్రమైన గాలి కూడా వస్తుంది. ఈ సమయంలో తన పని చూసుకోకుండా వారికి సహాయం చేస్తూ గొప్ప మనసు చాటుకున్నాడు. దీంతో ఇప్పుడు ఈ మాజీ క్రికెటర్ మీద అందరు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక వర్షం కారణంగా ఈ మ్యాచ్ రద్దయింది. మరి జాంటీ రోడ్స్ చేసిన పని మీకేవిధంగా అనిపించిందో కామెంట్ల రూపంలో తెలపండి.
Thank you @Anand_ac314 I was actually inspired by @msdhoni and the way he handled the incredible support he was shown at #EkanaStadium. Not just a legend, but a great man too #7 #legend #greathuman #respectthegame https://t.co/rlS0XKyCsO
— Jonty Rhodes (@JontyRhodes8) May 3, 2023