ఐపీఎల్ సందడి మొదలు కావడానికి ఇంకా కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. కానీ, సన్ రైజర్స్ హైదరాబాద్ అభిమానులకు మాత్రం ఐపీఎల్ ముందే మొదలై పోయింది. ఎస్సార్ హెచ్ కొనుగోలు చేసిన విండీస్ ప్లేయర్ నికోలస్ పూరన్ టీ10 బ్లాస్ట్ లో లెథర్ బాక్ జెయింట్స్, స్కార్లెట్ స్కార్చర్స్ మధ్య మ్యాచ్లో విధ్వంసకర బ్యాటింగ్ తో విరుచుకుపడ్డాడు. కేవలం 37 బంతుల్లో 10 సిక్సర్లు, 6 ఫోర్ల సాయంతో సెంచరీ చేశాడు. పూరన్ దెబ్బకు 129 పరుగుల లక్ష్యాన్ని కేవలం 8.3 ఓవర్లలోనే ఛేదించారు.
తమ నిర్ణయాలతో గత ఐపీఎల్ నుంచి కూడా హైదరాబాద్ ఫ్రాంచైజీ అభిమానుల ఆగ్రహానికి లోనవుతున్న విషయం తెలిసిందే. వార్నర్ ను వద్దనుకోవడం, రషీద్ ఖాన్ ను వదులుకోవడం, అన్ క్యాప్డ్ ప్లయర్ ను కోట్లు పెట్టి కొనడం వంటి నిర్ణయాలతో అభిమానులు విసిగెత్తిపోయి ఉన్నారు. పూరన్ విజృంభణ హైదరాబాద్ టీమ్ కు ఊరటనిచ్చే అంశమనే చెప్పాలి. నికోలస్ పూరన్ ను హైదరాబాద్ టీమ్ వేలంలో రూ.10.75 కోట్లకు కొనుగోలు చేసింది. పూరన్ గనుక ఇదే ప్రదర్శన ఐపీఎల్ లోనూ కొనసాగిస్తే.. సన్ రైజర్స్ హైదరాబాద్ అభిమానుల ఆనందానికి అవధులు ఉండవనే చెప్పాలి. టాటా ఐపీఎల్ 2022 సీజన్ టైటిల్ విన్నర్ సన్ రైజర్స్ హైదరాబాద్ అవుతుందా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Genius at work! 😱@nicholas_47 hit a ton off just 3️⃣7️⃣ balls including 6️⃣ fours and 1️⃣0️⃣ massive sixes to take the Leatherback Giants to a comfortable 9️⃣-wicket win! 👏
📺 Watch the best moments from this match on #FanCode 👉 https://t.co/c8dKvIy6GE pic.twitter.com/h5G2lrEo8s
— FanCode (@FanCode) March 1, 2022
మరిన్ని లైవ్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.