ఐపీఎల్ 2021లో రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు జట్టు తరఫున అదరగొట్టిన ఆసీస్ ఆల్‌రౌండర్ ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెత్తిపై నాలుగు వెంట్రుకలతో ఉన్న మ్యాక్స్‌వెల్ ఫొటో నెట్టింట్లో హల్‌చల్ చేస్తుంది. టీ20 వరల్డ్ కప్ సందర్భంగా శనివారం సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో బౌలింగ్ వేసి సౌతాఫ్రికా జట్టు కెప్టెన్ టిమ్‌బా బవుమాను క్లీన్ బౌల్డ్ చేశాడు. ఆ సమయంలో మ్యాక్సీ ఫొటోను కెమెరామెన్ క్లిక్ మనిపించాడు. వికెట్ తీసిన ఆనందంలో సింహగర్జన చేస్తున్న మ్యాక్సీ ఫొటోలో మాత్రం జట్టు ఊడి, బట్టతలతో అసలు ఇతను మ్యాక్స్‌వెల్‌యేనా అనే అనుమానం కలిగిలా ఉన్నాడు.
దాంతో ఈ ఫొటోలో ఉంది ఎవరో గుర్తుపట్టండి అంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో ఆ ఫొటోను వైరల్ చేస్తున్నారు. కాగా ఈ మ్యాచ్‌లో మ్యాక్సీ జట్టు ముడి వేసుకున్నాడు. అందుకే బట్టతల ఉన్నట్లు కనిపిస్తుంది. మ్యాచ్‌లో మాత్రం దక్షిణాఫ్రికాను ఆరంభంలోనే దెబ్బకొట్టాడు. జట్టు స్కోర్ 13 పరుగులు ఉండగా ఓపెనర్ బవుమాను క్లీన్‌బౌల్డ్ చేసి చావు దెబ్బ కొట్టాడు. అనంతరం వెంటవెంటనే వికెట్లు కోల్పోయి సౌతాఫ్రికా తీవ్ర కష్టాల్లో పడింది.
The golden arm of Glenn Maxwell strikes again 💪#T20WorldCup #AUSvSA https://t.co/dcX0vBJF7G
— ICC (@ICC) October 23, 2021