ఈ మద్య సినీ, రాజకీయ, క్రీడా రంగానికి చెందిన వారి వరుస మరణాలతో వారి కుటుంబ సభ్యులే కాదు.. అభిమానులు శోక సంద్రంలో మునిగిపోతున్నారు. న్యూజ్ లాండ్ మాజీ కెప్టెన్ బ్యారీ సింక్లెయిర్ (82) ఆదివారం కన్నుమూశారు.
క్రికెట్ రంగంలో ఆయనకు మంచి బ్యాట్ మెన్ గా గుర్తింపు ఉంది. కివీస్ తొలితరం మేటి బ్యాట్ మన్ గా బ్యారీ సింక్లెయిర్ టాప్ లీస్ట్ లో ఉండేవారు. ఆయన గ్రౌండ్ లో అడుగు పెడితే బౌలర్లకు చుక్కలు చూపించేవారని అంటారు. ఆయన 1963 నుంచి 68 వరకు 21 టెస్ట్ మ్యాచ్ లు ఆడారు.. మొత్తం 1148 పరుగులు చేశాడు. ఇందులో మూడు సెంచరీలు ఉన్నాయి.
బ్యారీ సింక్లెయిర్ 118 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడి.. ఆరు సెంచరీలు, 38 అర్థసెంచరీలు సాధించి మొత్తం 6114 పరుగులు తన ఖాతాలో వేసుకున్నాడు. కివీస్ తరఫున 3 మ్యాచ్‌లకు కెప్టెన్‌గా వ్యవహరించిన సింక్లెయిర్.. ఐదేళ్లలోనే అంతర్జాతీయ కెరీర్‌కు గుడ్‌బై చెప్పాడు. సింక్లెయిర్ మృతి పట్ల క్రికెట్ న్యూజిలాండ్ సంతాపం తెలిపింది.
ఇది చదవండి: సూర్యకుమార్ యాదవ్ ఆడినలాంటి షాట్స్ ఇప్పటివరకు చూడలేదు: ఇంగ్లాండ్ బౌలర్
Former New Zealand captain Barry Sinclair, who played 21 Tests between 1963 and 1968, has died aged 85
— ESPNcricinfo (@ESPNcricinfo) July 11, 2022