ఎంత పెద్ద సెలబ్రిటీలు అయినా సరే వాళ్లు కూడా మనలాంటి మనషులే కదా. కెరీర్ పరంగా ఎంత బాగా ఆడినప్పటికీ.. అదే టైంలో కాంట్రవర్సీల్లోనూ చిక్కుకుంటూ ఉంటారు. గతంలో పలువురు క్రికెటర్లు ఇలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినవారే. ఇప్పుడు ఆ లిస్టులోకి భారత మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ మరోసారి చేరారు. ఆయనపై ఏకంగా పోలీసులు FIR కూడా పెట్టడంతో క్రికెట్ వర్గాల్లో ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది. IPC 324, సెక్షన్ 504 కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రస్తుతం ఈ విషయమై క్రికెట్ అభిమానులు తెగ మాట్లాడుకుంటున్నారు. నెటిజన్స్ మధ్య ఇదే డిస్కషన్స్ నడుస్తోంది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. నిత్యం వివాదాల్లో ఉండే టీమిండియా మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీపై ముంబయి పోలీసులు కేసు నమోదు చేశారు. బాంద్రాలోని తన ఇంట్లో మద్యం మత్తులో తన భార్యపై దాడి చేశాడనే ఆరోపణలపై కేసు నమోదు చేశారు. వినోద్ కాంబ్లీ.. పాన్ హ్యాండిల్ ని తనపైకి విసిరాడని, దాని వల్ల తన తలకు గాయమైందని కాంబ్లీ భార్య ఆండ్రియా ఆరోపణలు చేసింది. గతంలో మద్యం మత్తులో కారుని ఢీ కొట్టిన కేసులో వినోద్ కాంబ్లీని బాంద్రా పోలీసులు అరెస్టు చేశారు. బాంద్రా సొసైటీకి చెందిన ఓ వ్యక్తి ఫిర్యాదుతో అప్పట్లో కాంబ్లీని అరెస్ట్ చేసినప్పటికీ.. ఆరోజే బెయిల్ పై రిలీజ్ చేశారు. ఇప్పుడు ఏకంగా తన భార్యని కొట్టిన విషయంలో పోలీస్ కేసు నమోదైంది.
వినోద్ కాంబ్లీ భార్య చెప్పిన దాని ప్రకారం.. వినోద్ కాంబ్లీ బాగా డ్రింక్ చేసి బాంద్రాలోని తన ఫ్లాట్ కు వచ్చాడు. మళ్లీ తాగొచ్చారా అని భార్య రెండు మాటలు అడిగేసరికి ఆమెని ఇష్టమొచ్చినట్లు తిట్టాడు. కొట్టడం కూడా చేశారు. ఈ క్రమంలో అక్కడి ఉన్న 12 ఏళ్ల కొడుకు, తండ్రి వినోద్ కాంబ్లీని ఆపడానికి ప్రయత్నించాడు. ఆ తర్వాత కాంబ్లీ.. కిచెన్ లోకి వెళ్లి పాన్ తెచ్చి భార్యపైకి విసిరాడు. గాయపడిన వినోద్ కాంబ్లీ భార్య, ట్రీట్ మెంట్ కోసం దగ్గరలోని బాబా హాస్పిటల్ కు వెళ్లింది. ఆ తర్వాత పోలీసుల దగ్గరకు వెళ్లి ఫిర్యాదు చేసింది. వాళ్లు కాంబ్లీకి ఫోన్ చేయగా.. స్విచ్ఛాప్ అని వస్తుంది. దీంతో ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఇదిలా ఉండగా టీమిండియా తరఫున 1991-2000 మధ్య వినోద్ కాంబ్లీ.. 17 టెస్టులు, 104 వన్డేలు ఆడాడు. సచిన్ తోనూ కాంబ్లీకి మంచి అనుబంధమే ఉంది. మరి వినోద్ కాంబ్లీ తన భార్యపై దాడి చేయడంపై మీరేం అనుకుంటున్నారు. కింద కామెంట్స్ లో మీ అభిప్రాయాన్ని పోస్ట్ చేయండి.
Maharashtra | FIR registered against former cricketer Vinod Kambli at Bandra Police Station in Mumbai on the complaint of his wife Andrea. Her complaint stated that he verbally abused and thrashed her under the influence of alcohol. No arrest made yet: Mumbai Police
(File photo) pic.twitter.com/TxKLpst2RP
— ANI (@ANI) February 5, 2023