ప్రేమలో పడి పెళ్లికి ముందే పేరెంట్స్ అయినా సినీ, క్రికెటర్లు చాలమందే ఉన్నారు. ఈ జాబితాలో మన ఇండియన్ క్రికెటర్ హార్ధిక్ పాండ్యా కూడా ఉన్నాడు. ఈ ఇండియన్ క్రికెటర్ పెళ్లికి ముందే తండ్రి అయ్యాడు. పాండ్యా బాలీవుడ్ నటి నటాషా స్టాంకోవిచ్ జనవరి 1, 2020న దుబాయ్‌లో నిశ్చితార్థం చేసుకున్నారు. హార్దిక్ పాండ్యా తన బిడ్డకు ‘అగస్త్య’ అని పేరు కూడా పెట్టడం విశేషం. అలానే ఈ జాబితాలో తాజాగా ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్ స్టువర్డ్ బ్రాడ్ కూడా చేరాడు. పెళ్లి కాకుండానే బ్రాండ్ ఓ బిడ్డకు తండ్రయ్యాడు. ప్రస్తుతం తన బిడ్డతో దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇంగ్లాండ్ ఫాస్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ గురించి క్రికెట్ ప్రియులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. మరీ ముఖ్యంగా ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ కి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. అందుకు కారణంగా 2007లో టీ20 ప్రపంచ కప్ లో బ్రాడ్ పేరిట నెలకొన్న ఓ రికార్డు అందుకు కారణం. వర్డల్ కప్ లోని ఆ మ్యాచ్‌లో స్టువర్ట్ బ్రాడ్ వేసిన 19వ ఓవర్‌లో యువరాజ్ ఆరు బంతుల్లో ఆరు సిక్సులు బాదాడు. అంతేకాదు 12 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించి చరిత్ర సృష్టించాడు. అలా బ్రాడ్ ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ కి బాగా సుపరిచితుడు. ఇక అతడి వ్యక్తిగత విషయానికి వస్తే కొన్నేళ్ల క్రితం మోలీ కింగ్ అనే సింగర్ తో పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమకు దారితీసింది. అలా వారిద్దరు కొన్నేళ్లుగా డేటింగ్ లో ఉన్నారు. ఈ క్రమంలో గతేడాది బ్రాడ్, మోలీ లు నిశ్చితార్ధం చేసుకున్నారు.
ఈ క్రమంలోనే ఇటీవల ఆమె గర్భవతి కూడా అయింది. ఆ విషయాన్ని మోలీ తన ఇన్ స్టాగ్రామ్ లో ఎంతో ఆనందంతో తెలియజేసింది. తన బేబి బంప్ కు సంబంధించిన ఫోటోలు వీడియోలు కూడా షేర్ చేసింది. బ్రాడ్ కూడా తాను త్వరలో తండ్రిని కాబోతున్నట్లు సంతోషన్ని వ్యక్తం చేశాడు. ఇద్దరు కలిసి వీడియోలు కూడా చేశారు. తాజాగా మోలీకి పండంటి ఆడబిడ్డకు జన్మించింది. వారిద్దరు తమ చేతుల్లో చిన్నారిని పట్టుకుని ఫోటోలకి ఫోజులు ఇచ్చారు. తమ కూతురితో దిగిన ఫోటోలను మోలీ కింగ్ తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. ఆ చిన్నారికి అన్నాబెల్లా బ్రాడ్ అని పేరు కూడా పెట్టారు. “ఈ కొత్త ప్రపంచంలోకి స్వాగతం అన్నాబెల్లా..నువ్వు రాక ముందు ఇంతటి ప్రేమను ఎప్పుడు చూడలేదు” అంటూ మోలీ ఇన్ స్టా లో రాసుకొచ్చారు.