క్రికెట్‌కు మరో గ్రేట్ ప్లేయర్ గుడ్‌బై చెప్పేశాడు. లిమిటెడ్ ఓవర్స్ క్రికెట్‌లో ఇంగ్లండ్ జట్టుకు ఎలా ఆడాలో నేర్పిన స్టార్ ప్లేయర్ రిటైర్మెంట్ ప్రకటించాడు.
జెంటిల్మన్ గేమ్‌కు మరో అద్భుతమైన ఆటగాడు గుడ్‌బై చెప్పేశాడు. అద్భుతమైన ఇన్నింగ్స్‌లతో లిమిటెడ్ ఓవర్స్ క్రికెట్‌లో ఇంగ్లండ్‌కు ఎన్నో చిరస్మరణీయ విజయాలను అందించిన ఇయాన్ మోర్గాన్ రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇంగ్లండ్ జట్టుకు ఆటగాడిగానే గాక కెప్టెన్‌గానూ సేవలందించిన మోర్గాన్.. క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్ల నుంచి తాను సన్యాసం తీసుకుంటున్నట్లు వెల్లడించాడు. ‘క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నా. ఈ విషయాన్ని ఎంతో గర్వంగా చెబుతున్నా. అన్ని ఫార్మాట్ల నుంచి వైదొలుగుతున్నా. ఇన్నేళ్లుగా నాకు ఎంతో ఇచ్చిన ఈ ఆట నుంచి తప్పుకునేందుకు ఇదే సరైన సమయం అని నమ్ముతున్నా. 2005లో ఇంగ్లండ్‌కు వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా ప్రతి క్షణాన్ని ఆస్వాదించా’ అని మోర్గాన్ ట్టిట్టర్ పోస్టులో తన నిర్ణయాన్ని తెలియజేశాడు.
లిమిటెడ్ ఓవర్స్ క్రికెట్‌లో సారథిగా మోర్గాన్ ఫుల్ సక్సెస్ అయ్యాడు. ఇంగ్లండ్ జట్టు టీ20, వన్డే ప్రపంచ కప్‌లు గెలవడంలో అతడిది కీలక పాత్ర అని చెప్పుకోవచ్చు. 126 వన్డేల్లో ఇంగ్లండ్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన మోర్గాన్.. 72 టీ20ల్లో ఇంగ్లీష్ జట్టును ముందుండి నడిపించాడు. వన్డేల్లో అతడు 6,957 పరుగులు చేశాడు. టీ20ల్లో 2,458 రన్స్ చేశాడు. ఇంగ్లండ్ తరఫున రెండు ఫార్మాట్లలోనూ అత్యధిక సిక్సులు కొట్టింది మోర్గానే కావడం విశేషం. ఐర్లాండ్‌కు చెందిన మోర్గాన్.. క్రికెట్ కెరీర్ కోసం 16 ఏళ్ల వయసులో ఇంగ్లండ్‌కు షిఫ్ట్ అయ్యాడు. ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు తరఫున రెండు సీజన్లలో అతడు ప్రాతినిధ్యం వహించాడు. మరి, మోర్గాన్ రిటైర్మెంట్ నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
— Eoin Morgan (@Eoin16) February 13, 2023