ఆమె స్టార్ క్రికెటర్. దేశం తరఫున ఎన్నో మ్యాచుల్లో అద్భుత ప్రదర్శన చేసింది. అప్పట్లోనే కోహ్లీకి పెళ్లి ప్రపోజల్ పెట్టింది. ఇప్పుడు ఓ లేడీ ఫుట్ బాలర్ తో రిలేషన్ లో ఉన్నట్లు బయటపెట్టింది.
ఆ జట్టు మహిళా క్రికెటర్లు ఒకరితర్వాత షాకిస్తున్నారు. వాళ్ల దేశంలో అది సాధారణమైన విషయం కానీ మనకు మాత్రం కాస్త వింతగా ఉంటుంది. ఎందుకంటే కొన్నేళ్ల ముందు ఇంగ్లాండ్ క్రికెటర్ సారా టేలర్, డయాన్ అనే అమ్మాయిని పెళ్లి చేసుకుంది. రీసెంట్ గా వాళ్లిద్దరూ తల్లిదండ్రులు కాబోతున్నట్లు అనౌన్స్ చేశారు. దీంతో నెటిజన్స్ ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఎందుకంటే ఇద్దరమ్మాయిల మధ్య ఇది ఎలా జరిగిందని తెగ గుసగుసలాడుకుంటున్నారు. ఇది బయటపడి వారం కూడా కాలేదు. తాజాగా మరో ఇంగ్లాండ్ క్రికెటర్ తాను ఓ ప్లేయర్ తో రిలేషన్ లో ఉన్నానని రివీల్ చేసింది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. స్వలింగ సంపర్క వివాహం అంటే ఒకే జెండర్ కు చెందిన ఇద్దరు పెళ్లి చేసుకోవచ్చు లేదా రిలేషన్ లో ఉండొచ్చు అని చాలా దేశాల్లో చట్టాలున్నాయి. గతంలో ఇలాంటి విషయాల్లో కాస్త భయపడేవారు కానీ గత కొన్నేళ్లలో తీసుకుంటే జనాల ఆలోచనల్లో మార్పొచ్చింది. అలా చాలామంది లేడీ క్రికెటర్లు, సెలబ్రిటీ మేల్ పర్సన్స్ కూడా తమ రిలేషన్ ని వ్యక్తపరుస్తున్నారు. అలా ఇంగ్లాండ్ క్రికెటర్ డేనియల్ వ్యాట్.. తమ దేశానికి చెందిన ఫుట్ బాల్ ప్లేయర్ గోర్గి హోడ్గేని ముద్దుపెట్టుకుంటున్న ఫొటోని పోస్ట్ చేసింది.
ఈ ఫొటోకి క్యాప్షన్ గా ‘మైన్ ఫరేవర్’ అని డేనియల్ వ్యాట్ పెట్టుకొచ్చింది. అంటే నువ్వు ఎప్పటికీ నాకే సొంతం అని అర్థం. ఇక్కడ విచిత్రం ఏంటంటే.. క్రికెటర్ డేనియల్ వ్యాట్ గతంలో కోహ్లీని పెళ్లి చేసుకుంటానని ప్రపోజల్ పెట్టింది. 2014లో జరిగిన ఈ విషయాన్ని కపిల్ శర్మ షోలో కోహ్లీ చెప్పుకొచ్చాడు. అయితే ఆ టైంలో కోహ్లీ బిజీగా ఉన్నందు వల్ల ఈ టాపిక్ అక్కడితో ఎండ్ అయిపోయింది. ఏదైతేనేం ఇది అప్పట్లో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ కూడా అయింది. ఆ క్రీడాకారిణి ఇప్పుడు ఓ లేడీని ఎంగేజ్ మెంట్ చేసుకునేసరికి విరాట్ ఫ్యాన్స్ ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు. ‘విరాట్ భాయ్ జస్ట్ లో మిస్’ అని మాట్లాడుకుంటున్నారు. మరి ఇద్దరు ప్లేయర్స్ ఒక్కటి కావడంపై మీరేం అంటారు. కింద కామెంట్ చేయండి.
Mine forever 😍💍❤️ pic.twitter.com/cal3fyfsEs
— Danielle Wyatt (@Danni_Wyatt) March 2, 2023