యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ క్రీజులో ఉన్నాడంటే బౌలర్‌కు చమటలు పట్టాల్సిందే. బాల్ కోసం బౌండ్రీలకు పరిగెత్తాల్సిందే. ఇక బాస్ ఫామ్‌లో ఉంటే అంతే సంగతులు మామూలుగా ఉండదు. కరీబియన్ ప్రీమియర్ లీగ్ మ్యాచ్‌లో గేల్ కొట్టిన భారీ సిక్స్ ఇప్పుడు నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతోంది.
జేసన్ హోల్డర్ వేసిన బాల్‌ను భారీ సిక్స్‌గా మలిచాడు క్రిస్ గేల్. అక్కడితో అయిపోలేదు. ఆ బాల్ నేరుగా వెళ్లి స్కోర్ డిస్‌ప్లే గ్లాస్‌కు తగిలింది. అంతే, దెబ్బకు అద్దం బద్దలైంది. సెంట్ కిట్స్ నెవిస్ పాట్రియోట్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న గేల్.. బార్బడోస్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ సన్నివేశం జరిగింది. ఆ సిక్స్, ఓ ఫోర్ మినహా మ్యాచ్‌లో గేల్ పెద్దగా ఆకట్టుకున్నది లేదు. 9 బంతుల్లో 12 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు.
ఈ మ్యాచ్‌లో సెంట్ కిట్స్ విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసి 20 ఓవర్లలో సెంట్‌కిట్స్ 175/5 పరుగులు చేసింది. ష్రెఫాన్ రూథర్‌ఫర్డ్ 53 నాటౌట్, బ్రావో 47 నాటౌట్‌తో ఆకట్టుకున్నారు. తర్వాత బ్యాటింగ్ చేసిన బార్బడోస్ రాయల్స్ 7 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది.
A SMASHING HIT by the Universe Boss @henrygayle sees him with the @OmegaXL hit from match 2. #CPL21 #BRvSKNP #CricketPlayedLouder #OmegaXL pic.twitter.com/8001dFwNWQ
— CPL T20 (@CPL) August 27, 2021