ప్రపంచ క్రికెట్ లో ఇప్పుడు వెస్టిండీస్ జట్టు మీద సానుభూతి కురుస్తుంది. ఒకప్పుడు తమ ఆట తీరుతో వరుసగా రెండు సార్లు ఛాంపియన్ లుగా నిలిచిన విండీస్ జట్టు ప్రస్తుతం అధ్వాన స్థితిలో ఉంది. జింబాబ్వే, నెదర్లాండ్స్, స్కాట్లాండ్ జట్ల చేతిలో ఓడిపోయి మరో రెండు మ్యాచులు ఉండగానే వరల్డ్ కప్ అర్హత సాధించే అవకాశాలు కోల్పోయింది.
వరల్డ్ కప్ లో ఎంతో ఘన కీర్తిని కలిగిన వెస్టిండీస్ జట్టు ఈ ఏడాది జరగబోయే వరల్డ్ కప్ కి అర్హత సాధించకుండానే ఇంటి ముఖం పట్టింది. వరుసగా పసికూనల చేతిలో ఓడిపోయి అతి కష్టంగా సూపర్ సిక్స్ కి చేరుకున్న విండీస్ జట్టు.. సూపర్ సిక్స్ లో స్కాట్లాండ్ చేతిలో అనూహ్య ఓటమిని చవి చూసింది. లీగ్ దశలో వరుసగా రెండు విజయాలతో క్వాలిఫయర్స్ ని గ్రాండ్ గా ఆరంభించినా.. ఆ తర్వాత వరుస ఓటములు విండీస్ జట్టని కోలుకోలేని దెబ్బ తీశాయి. జింబాబ్వే, నెదర్లాండ్స్, స్కాట్లాండ్ జట్ల చేతిలో ఓడిపోయి మరో రెండు మ్యాచులు ఉండగానే వరల్డ్ కప్ అర్హత సాధించే అవకాశాలు కోల్పోయింది.దీంతో ఇప్పుడు ఫ్యాన్స్, మాజీలతో సహా ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ దశలో ఇప్పుడు యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ చేసిన ఎమోషనల్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ప్రపంచ క్రికెట్ లో ఇప్పుడు వెస్టిండీస్ జట్టు మీద సానుభూతి కురుస్తుంది. ఒకప్పుడు తమ ఆట తీరుతో వరుసగా రెండు సార్లు ఛాంపియన్ లుగా నిలిచిన విండీస్ జట్టు ప్రస్తుతం అధ్వాన స్థితిలో ఉంది. క్వాలిఫయర్స్ మ్యాచులు ఆడటమే అవమానంగా భావించిన వేళ.. కనీసం వరల్డ్ కప్ రేస్ లో కూడా నిలవలేకపోయింది. సూపర్ సిక్స్ లో మూడు మ్యాచులు గెలిచినా ఇతర మ్యాచుల ఫలితాలపై ఆధారపడాల్సిన పరిస్థితి. కానీ తొలి మ్యాచులోనే స్కాట్లాండ్ చేతిలో చావు దెబ్బ తిన్నది. దీంతో ఏ మూలో ఉన్న ఆశలు కూడా పోయాయి. అయితే విండీస్ ఓటమికి ఆవేదనను తేలియాజేస్తూ ఐసీసీ కూడా ఒక వీడియో షేర్ చేసింది.
ఐసీసీ కూడా వెస్టిండీస్ టీమ్ ఆటగాళ్ల ఆవేదనను తెలియజేస్తూ ఇన్‌స్టాలో ఓ రీల్ షేర్ చేసింది. ఇందులో వెస్టిండీస్ టీమ్ ఆటగాళ్లు, మాజీ ప్లేయర్లు తీవ్ర బాధను వ్యక్తం చేస్తూ భావోద్వేగానికి గురయ్యారు. ఈ వీడియోపై స్పందించిన యూనివర్స్ బాస్, వెస్టిండీస్ దిగ్గజ ప్లేయర్ క్రిస్ గేల్.. ఈ పోస్ట్‌ను తొలగించాలంటూ ఐసీసీని కోరాడు. విండీస్ జట్టు వరల్డ్ కప్ కి అర్హత సాధించకపోవడం ఇదే తొలిసారి. దీంతో ఈ పోస్ట్ చూసిన గేల్ మరింత ఎమోషనల్ అయ్యాడు. ప్రస్తుతం ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మరి గేల్ ఇలా చిన్న పిల్లాడిలా ఎమోషనల్ అవ్వడం మీకేవిధంగా అనిపించిందో కామెంట్ల రూపంలో తెలపండి.